ఫేక్ మెసేజ్ కు భయపడి స్టూడెంట్ ఆత్మహత్య.. ఇంతకీ దానిని ఎవరు పంపించారు..? అందులో ఏముందంటే ?
ఓ ఫేక్ మెసేజ్ బాలుడి ప్రాణాలను బలిగొంది. ఆ మేసేజ్ ను చూసిన ఇంటర్ స్టూడెంట్ భయపడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేరరళ రాష్ట్రంలో జరిగింది. ఇంతకీ ఆ మేసేజ్ ఎవరు పంపించారు. ? అందులో ఏముందంటే ?
ఫేక్ మెసేజ్ కు భయపడి ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోజికోడ్ పట్ణణంలో ఆదినాథ్ అనే స్టూడెంట్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆ బాలుడికి కొంత కాలం కిందట నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. దానిని చూసి ఆ బాలుడు తీవ్ర ఆందోళన చెందాడు.
పిడుగుల వాన బీభత్సం.. ఆదిలాబాద్ లో ముగ్గురు, ములుగులో ఒకరు మృతి.. పలు మూగ జీవాల మృత్యువాత
ఓ అనధికార సినిమా వెబ్ సైట్ లో లాగిన్ అయ్యావని, దీని వల్ల 30 వేల రూపాయిలు ఫైన్ చెల్లించాలని ఆ మెసేజ్ లో సారాంశం. ఈ మెసేజ్ చూసిన వెంటనే ఆదినాథ్ తను నివాసం ఉండే ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి ఇంట్లో ఓ సూసైడ్ నోట్ లభించింది.
ఆ నోట్ ను ఆదినాథ్ తన తల్లిని ఉద్దేశించి రాశాడు. ఎలాంటి చట్టవిరద్ధ వెబ్ సైట్ ను తాను యాక్సెస్ చేయలేదని అందులో పేర్కొన్నాడు. కాకపోతే, కొంత కాలం కిందట ఓ అధికారిక వైబ్ సైట్ లోనే సినిమా చూశానని వివరించాడు. ఈ నేపథ్యంలో బాలుడికి మెసేజ్ రావడం, దానికి భయపడి ఆందోళన చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
రూ. 2000 నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు.. మార్చుకోకపోతే ఆ నోట్లు చెల్లవా..?
ఆ మెసేజ్ ను ఆన్ లైన్ మోసంగా పోలీసులు పరిగణించారు. దర్యాప్తులో భాగంగా ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆదినాథ్ ఎలాంటి తప్పుడు వెబ్ సైట్లను ఓపెన్ చేసినట్టు ఆధారాలు దొరకలేదు. అయితే ఇంకా లోతుగా దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇంకా తల్లిదండ్రుల నుంచి పలు వివరాలు పోలీసులు సేకరించే పనిలో పడ్డారు.