రూ. 2000 నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు.. మార్చుకోకపోతే ఆ నోట్లు చెల్లవా..?
Rs.2000 Notes: 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి నేటీతో గడువు ముగియనున్నది. RBI ప్రకారం, బ్యాంకుల్లో నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి 30 సెప్టెంబర్ 2023 చివరి తేదీ. అయితే 2000 రూపాయల నోట్లు చట్టబద్ధంగా ఉంటాయా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది.

Rs.2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కు ఆర్బీఐ ఇచ్చిన గడువు నేటీతో తీరనున్నది. రేపటి నుంచి రూ.2వేల నోటు చెల్లకుండా మిగిపోతుంది. అయితే.. ఇప్పటికే చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకులలో జమచేశారు. మరికొందరూ ఇతరత్రా లావాదేవీల ద్వారా ఆ నోట్లను మార్పిడి చేసుకున్నారు. అయినా.. కొంతమంది నిర్లక్ష్యంగా.. ఏమరపాటుతో ఉన్నారు. అలాంటి వారికి ఆ రోజే చివరి అవకాశం నేడే బ్యాంకులకు వెళ్లి తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోనే అతిపెద్ద కరెన్సీ నోటును రద్దు చేస్తున్నట్లు మే 19, 2023 న ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం.. రూ. 2,000 నోటును చెలామణి నుంచి తొలగించింది. అయితే.. మార్కెట్‌లో ఉన్న ఈ నోట్లను మార్పిడి చేసుకోవడానికి సెప్టెంబర్ 30 తేదీ వరకు సదుపాయాన్ని కల్పించింది.
ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..మార్చి 31, 2023 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది. సెప్టెంబరు 1, 2023న ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రూ.24,000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా సామాన్య ప్రజల వద్దనే ఉన్నాయనీ, అవి బ్యాంకులకు తిరిగి రావాల్సి ఉంది. అందులో రూ.3.32 లక్షల కోట్లు అంటే 93 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి.
మిగిలిన 7 శాతం అంటే రూ. 24,000 కోట్ల రూ. 2000 నోట్లు ఇంకా తిరిగి రావాల్సి ఉంది. 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి గడువు ముగిసిన తర్వాత.. RBI తన ప్రాంతీయ కార్యాలయాలలో కొంత సమయం వరకు మరిన్ని నోట్లను మార్చుకోవడానికి అనుమతించవచ్చని, తద్వారా ప్రజలు ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు. అయితే RBI దీనిపై తన స్టాండ్‌ను 30 సెప్టెంబర్ 2023న స్పష్టం చేయవచ్చు.
గడువు పొడిగిస్తారా?
పెద్ద నోట్ల మార్పిడికి గడువు పెంచుతారా? అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది. సాధారణంగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసినా.. లేదా నామినీ పేరును డీమ్యాట్‌తో లింక్ చేసినా.. అటువంటి ఫైనాన్స్ సంబంధిత పనుల కోసం గడువు తేదీని పొడిగిస్తుంటారు. ఈ విషయంతో కూడా గడువు తేదీని పొడిగిస్తారనే ఆశ ఉంది. ఎందుకంటే..వరుసగా బ్యాంకుకు సెలవులుండటంతో ఆర్బీఐ మరోనెల పొడిగించే అవకాశం ఉన్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.