మరీ ఇంత నిర్లక్ష్యమా..? తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో బాలిక మృతి.. మృతదేహాన్ని బయట వదిలేసి సిబ్బంది పరార్
ఆసుపత్రి వెలుపల బైక్‌పై పడి ఉన్న బాలిక మృతదేహం కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి, ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందినది. అసలేం జరిగింది? బాలిక శవాన్ని బైక్ మీద ఎందుకు కూర్చోబెట్టారు.

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మెయిన్‌పురి జిల్లా ఘిరోర్ ప్రాంతంలో ఓ యువతికి ఓ డాక్టర్ తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో బాలిక ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని వైద్యులు బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. అంతేకాదు.. ఈ విషయాన్ని దాచిపెట్టి.. ఆమె ఆరోగ్యం క్షీణించిందని, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం డాక్టర్, సిబ్బంది బాలిక మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న సీఎంఓ ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దు చేసి సీల్ వేశారు. వైద్యులు, ఆపరేటర్లు మూడు రోజుల్లోగా అవసరమైన పత్రాలతో హాజరుకావాలని కోరారు.
అందిన సమాచారం ప్రకారం.. ఘీరోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా ఓయేలో నివసిస్తున్న గిరీష్ యాదవ్ కుమార్తె భారతి (17) ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంగళవారం నాడు భారతిని ఘిరోర్ ప్రాంతంలోని కర్హల్ రోడ్‌లో ఉన్న రాధా స్వామి ఆసుపత్రిలో చేర్చింది. బుధవారం మధ్యాహ్నం భారతి మృతి చెందగా, వైద్యుడు, సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని బయటకు తీశారు.
మృతురాలి అత్త మనీషా సమాచారం అందించగా.. మంగళవారం భారతికి జ్వరం వచ్చిందని, ఆ తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ఆమె బుధవారం పూర్తిగా క్షేమంగా ఉంది, కానీ డాక్టర్ ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వడంతో, ఆమె పరిస్థితి క్షీణించిందనీ, దీంతో ఆమె మరణించిందని ఆరోపిస్తున్నారు. ఆమె చనిపోయిన విషయం తెలియజేయకుండా.. పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. అయితే వైద్యుడు ఈ సమాచారం ఇచ్చే సమయానికి భారతి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్‌సి గుప్తా మాట్లాడుతూ.. మీడియా ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని చెప్పారు. దీంతో నోడల్ ఇన్ చార్జీ డాక్టర్ అజయ్ కుమార్‌కు సంఘటన స్థలానికి పంపించాడు. అక్కడ ఆసుపత్రి నిర్వాహకుడు, వైద్యుడు కనిపించలేదు. దీంతో ఆ బాలిక శవాన్ని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో తరలించారు. ఈ క్రమంంలో ఆస్పత్రికి సీల్ వేశారు. ఆసుపత్రి నమోదు చేయబడింది , కానీ ఆసుపత్రి ఆపరేటర్ డాక్టర్ కాకపోవడంతో లైసెన్స్ రద్దు చేశారు.