తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేకపోయాననే మనస్థాపంతో ఓ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో చోటు చేసుకుంది. తల్లితో మాట్లాడేందుకు వార్డెన్ ఫోన్ ఇవ్వకపోడంతో బాలుడు ఈ ఘాతుకానికి ఒడిఘట్టాడు.
ఆ పిల్లాడు హాస్టల్ ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే తన తల్లి పుట్టిన రోజు రావడంతో ఫోన్ చేసి విషెష్ చెప్పాలనుకున్నాడు. తన వద్ద ఫోన్ లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. తనకు ఫోన్ కావాలని కోరాడు. కానీ దానికి వార్డెన్ నిరాకరించాడు. చివరికి విషెష్ చెప్పలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ.. సింధ్ నదిలో చిక్కుకున్న పౌరులను కాపాడిన సైనికులు
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు సమీపంలోని హోసాకోట్ లో నివాసం ఉండే పూర్వాజ్ (14) ఓ హాస్టల్ ఉంటున్నాడు. తన తల్లి పుట్టినరోజు (జూన్ 11) నాడు ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపాలని అనుకొని మొబైల్ ఫోన్ కోసం వార్డెన్‌ని అభ్యర్థించాడు. అయితే వార్డెన్ ఫోన్ ఇవ్వలేదు. అంతేకాకుండా బాలుడి కుటుంబ సభ్యులు పిల్లాడిని సంప్రదించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. అయినప్పటికీ వార్డెన్ మాట్లాడటానికి అనుమతించలేదు. ఈ పరిణామాలతో పూర్వాజ్ మనస్థాపానికి గురయ్యాడు.
శనివారం అర్ధరాత్రి సమయంలో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం హాస్టల్‌లోని ఇతర విద్యార్థులు పూర్వజ్ మృతి చెంది ఉండటాన్ని గుర్తించారుర. వెంటనే హాస్టల్ మేనేజ్ మెంట్ కు సమాచారం అందించారు. బాలుడి తల్లిదండ్రులు అదే రోజు హాస్టల్‌కు చేరుకున్నారు. బాలుడి ఆతహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
‘‘ఒక మహిళపై ద్వేషం.. లౌకిక ఉదారవాదుల మౌనం’’ - గౌతమ్ గంభీర్.. నూపుర్ శర్మకు మద్దతు
ఇదిలా ఉండగా.. పబ్జీ గేమ్ లో ఓడిపోయానని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు. ఈ ఓటమి అవమానాన్ని తట్టుకోలేక తాను వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీశాడు. దీంతో ప్రభు విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తోంది - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.
