విహార యాత్రకు వెళ్లిన నలుగురు వ్యక్తులకు అనుకోని చేదు అనుభవం ఎదురైంది. సింధ్ నది దాటుతున్న క్రమంలో వారి వాహనం అందులో ఇరుక్కుపోయింది. దీంతో ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకొని వారిని రక్షించింది. 

ఇండియ‌న్ ఆర్మీ శత్రువుల‌కు ఎదురు నిలిచి ధైర్య సాహసాలు ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాదు.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు త‌న రెస్క్యూ మిషన్‌లను కూడా నిర్వహించి పౌరుల‌కు సహాయం చేస్తుంటుంది. గ‌తంలో ఇలా ఎన్నో రెస్క్యూ ఆప‌రేష‌న్ల‌లో పాల్గొని దేశ పౌరుల మ‌న‌సు దోచుకుంది. తాజాగా ఆదివారం కూడా జమ్మూ కాశ్మీర్‌లోని బల్తాల్ ప్రాంతానికి సమీపంలో సింధ్ నదిలో వాహనం చిక్కుకున్న న‌లుగిరి ఆర్మీ ర‌క్షించింది. వారిని సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చింది. దీంతో ఆర్మీ సిబ్బందిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. 

‘‘ఒక మహిళపై ద్వేషం.. లౌకిక ఉదారవాదుల మౌనం’’ - గౌతమ్ గంభీర్.. నూపుర్ శర్మకు మద్దతు

దీనికి సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. న‌లుగురు వ్య‌క్తులు సోనామార్గ్‌కు విహారయాత్ర కోసం జమ్మూ కాశ్మీర్‌లోని బల్తాల్ ప్రాంతానికి వ‌చ్చారు. అయితే ఇదే స‌మ‌యంలో వారు సోనామార్ట్ న‌దినికి వారి వాహ‌నం సాయంతో దాటాల‌ని అనుకున్నారు. కానీ ఇలా ప్ర‌య‌త్నించిన‌ప్పుడు వారి వాహనం సింధ్ నదిలో చిక్కుకుంది. దీంతో వారు అటు ఒడ్డుకు వెళ్ల‌లేక‌, వెన‌క్కి పోలేక తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని అందులోనే ఉండిపోయారు. అయితే ఇదే స‌మ‌యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం బాల్టాల్-డోమెల్ వద్ద మోహరించిన ఇండియ‌న్ ఆర్మీ పెట్రోలింగ్ బృందం నదిలో చిక్కుకున్న వాహ‌నాన్ని గ‌మ‌నించింది. 

Scroll to load tweet…

దీంతో వెంట‌నే ఆర్మీ సిబ్బంది రిక‌వ‌రీ వాహ‌నం, రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను తీసుకొని ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుంది. హుటా హుటిని వారిని కాపాడే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఆర్మీ త‌న జేసీబీని ఉప‌యోగించి, వ‌ల సహాయంతో ఆ న‌లుగురు పౌరుల‌ను రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నెటిజ‌న్లు ఆర్మీ సిబ్బంది సేవ‌ల‌ను కొనియాడారు. 

బీజేపీ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తోంది - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

అలాగే ఈ వారం ప్రారంభంలో గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో బోర్‌వెల్‌లో చిక్కుకున్న 18 నెలల బాలుడిని ఇండియ‌న్ ఆర్మీ సిబ్బంది రక్షించింది. దాదాపు 45 నిమిషాల పాటు రెస్క్యూ మిషన్ త‌న ఆప‌రేష‌న్ ను కొనసాగింది. జూన్ 7వ తేదీన దూదాపూర్ గ్రామంలో శివం అనే బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఈ విష‌యం స్థానిక అధికారుల‌కు తెలిసింది. దీంతో వారు అక్క‌డికి చేరుకున్నారు. అధికారులు వెంట‌నే స్థానిక ఆర్మీ సైన్యాన్ని ఆశ్రయించారు. దీంతో సిబ్బంది రెస్క్యూ ఆప‌రేష‌న్ చేపట్టి బాలుడిని బ‌య‌ట‌కు తీసింది. అనంత‌రం చికిత్స కోసం హాస్పిట‌ల్ కు త‌ర‌లించింది.