ఢిల్లీ సరిహద్దుల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ర్యాలీలు ఆపాలని సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై మరి కాసేపట్లో విచారణ విచారణ జరిగే అవకాశం ఉంది.
నూహ్ మతఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ ), భజరంగ్ దళ్ ప్రకటించిన ర్యాలీలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ర్యాలీలను నిలిపివేయాలని సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్ అనిరుద్ధ బోస్ ను కోరారు. కానీ ఈ పిటిషన్ సీజేఐకి రిఫర్ చేశారని ‘ఇండియా టుడే’ పేర్కొంది.
దారుణం.. బాలికపై పలుమార్లు మేనబావ, అతడి స్నేహితులు అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరు..
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఢిల్లీలోని సీలంపూర్, బదర్పూర్ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే దీనిపై మరి కాసేపట్లో విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. హరియాణాలోని నుహ్ లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) - భజరంగ్ దళ్ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిలుపు మేరకు కార్యకర్తలు ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రదర్శన చేపడుతున్నారు. అయితే ఈ నిరసనలపై పోలీసులు అధికారులు, ఇంటిలిజెన్స్ ముందుగానే అలెర్ట్ అయ్యాయి. అందుకే దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదిలా ఉండగా.. మనేసర్ లోని భీసం దాస్ మందిర్ లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్ కు కూడా వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. ఈ మితవాద సంస్థల ఆధ్వర్యంలో సెక్టార్ 21ఏలోని నోయిడా స్టేడియం నుంచి సెక్టార్ 16లోని రజనీగంధ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేస్తామని వీహెచ్ పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు.
మృత్యుంజయుడు.. థానే ప్రమాదంలో 115 అడుగుల ఎత్తులో నుంచి పడినా.. గాయాలతో బయటపడ్డ కార్మికుడు
కాగా.. రెండు రోజులు పాటు అట్టుడుకుపోయిన హర్యానాలోని గురుగ్రామ్, నూహ్ లో ప్రస్తుతం శాంతిభద్రతలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. గురుగ్రామ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని, ఇంటర్నెట్ పనిచేస్తోందని గురుగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరుణ్ దహియా (క్రైమ్) తెలిపారు.
‘‘పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇంటర్నెట్ కూడా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ '112'ను సంప్రదించవచ్చు’’ అని గురుగ్రామ్ ఏసీపీ దహియా (క్రైమ్) తెలిపారు.
