దాదాపు 10 అంతస్థుల ఎత్తు పైనుంచి కింద పడిపోయినా ఓ కార్మికుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే డిశ్చార్జి కానున్నారు.
మహారాష్ట్రలోని తానేలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ యంత్రం కూలిపోయింది. దీంతో 16 మంది వరకు చనిపోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే ఆ సమయంలో 115 అడుగుల ఎత్తులో ఉన్న ఓ కార్మికుడు కూడా అక్కడి నుంచి కింద పడిపోయాడు. కానీ ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.
అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రత నమోదు
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. బీహార్ కు చెందిన ప్రకాశ్ గత 13 ఏళ్ల కిందట ముంబైకి వలస వచ్చాడు. అక్కడే వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం కిందటి వరకు ఓ ట్రక్కులో స్వీపర్ గా పనిచేశాడు. అయితే ఎనిమిది నెలల కిందట లవ్ కుష్ కుమార్ (25) అనే స్నేహితుడు అయితే నిర్మాణ పనుల్లో కూలీగా పని ఇప్పించాడు.
ఈ క్రమంలో కొంత కాలం నుంచి అందులో ప్రకాశ్ పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అతడు నిమగ్నమయ్యాడు. అయితే ఒక్క సారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆయన 115 అడుగుల ఎత్తు నుంచి పడిపోయాడు. కానీ అతడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే కేకలు వేశాడు. స్థానికులు వచ్చి శిథిలాల కింద నుంచి అతడిని బయటకు తీసుకొచ్చారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల.. ఎనిమిది ప్రశ్నలను తొలగించిన టీఎస్‌పీఎస్సీ..
అనంతరం షాపూర్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నాడు. ప్రకాశ్ కు స్వల్ప గాయాలు అయ్యాయని, త్వరలోనే అతడిని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు ప్రకటించారు. కాగా.. ప్రకాశ్ కు పని ఇప్పించిన లవ్ కుష్ కుమార్ ఈ ప్రమాదంలో చనిపోవడం శోఛనీయం. దీనిపై కార్మికుడు మాట్లాడుతూ.. తన స్నేహితుడు చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదం కొన్ని క్షణాల్లో జరిగిపోయిందని చెప్పారు.
