కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఐదుగురు కామాంధులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. 2019లో మొదటిసారి బాలిక అఘాయిత్యానికి గురైంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్టు చేశారు. 

ఓ బాలికపై సొంత మేనమామ దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత అతడి స్నేహితులు కూడా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు. అందులో ఒకరు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు ఈ ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

శాంతించిన గురుగ్రామ్.. తెరుచుకున్న స్కూళ్లు, ఆఫీసులు.. ఆంక్షలు ఎత్తేసిన పోలీసులు

‘ఇండియా టుడే ’ కథనం ప్రకారం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 2019లో మేనమామ కుమారుడు జయప్రకాశ్ (30) మొదటి సారిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. బాధితురాలి వివరాలను కూడా వారికి తెలియజేశారు. దీంతో వారు కూడా ఆమె లైంగిక దాడికి పాల్పడ్డాలని నిర్ణయించుకున్నారు. 

మృత్యుంజయుడు.. థానే ప్రమాదంలో 115 అడుగుల ఎత్తులో నుంచి పడినా.. గాయాలతో బయటపడ్డ కార్మికుడు

ఈ ఏడాది మే నెలలో జయప్రకాశ్ స్నేహితుడైన రాజా(28) బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మరో ఇద్దరు స్నేహితులైన అక్షయ్ దేవడిగ(24), సుకుమార్ బెల్చడ(28) ఆమెపై జూన్ లో అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ ఈ విషయాన్ని బాధితురాలు ఎవరికీ వెళ్లడించలేదు. అయితే ఇందులో సుకుమార్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 

బాధితురాలిని తన గ్రామమైన బెరపడావు ఆహ్వానించాడు. ఆమెపై వచ్చిన తరువాత ఆమెపై మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మళ్లీ చివరి సారిగా జూలై 28వ తేదీన కూడా బాలికను ఇదే విధంగా నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను కోజప్పడి గ్రామానికి పిలిపించుకున్నాడు. అనంతరం మళ్లీ ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.

అల్లరిమూక ఆగడాలకు విద్యార్థిని బలి.. వేధిస్తూ, బలవంతంగా శానిటైజర్ తాగించి, అడ్డొచ్చిన సోదరుడిపై కూడా..

దీంతో బాధితురాలు విసిగిపోయి విటల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తనపై పలుమార్లు జరిగిన అత్యాచారాన్ని పోలీసులకు వివరించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఈ ఐదుగురిపై నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోస్కో), ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.