ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఎవరైనా సరే .. భార్య లేకుండా ప్రధాని అధికారిక నివాసంలో వుండొద్దన్నారు. కరప్ట్ పొలిటీషియన్స్ కన్వీనర్ మోడీయే అని లాలూ సెటైర్లు వేశారు.  

రాజకీయాలతో ప్రత్యర్ధులను చిత్తు చేయడమే కాదు.. తనదైన పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించే అరుదైన రాజకీయ నాయకుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయన ఒక్కసారి మైక్ అందుకున్నారంటే అక్కడున్న వారి పొట్టచెక్కలవ్వాల్సిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని లాలూ టార్గెట్ చేశారు. ప్రధానిగా వుండే వ్యక్తి ఖచ్చితంగా భార్య లేనివాడిగా వుండకూదన్నారు. భార్య లేకుండా ప్రధాని అధికారిక నివాసంలో వుండకూడదని.. ఈ నియమాన్ని ఫాలో అవ్వాలని లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలకు కనీసం 300 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరప్ట్ పొలిటీషియన్స్ కన్వీనర్ మోడీయే అని లాలూ సెటైర్లు వేశారు. మహారాష్ట్ర రాజకీయాలే ఇందుకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. 

ఇకపోతే.. గత నెలలో పాట్నాలో బుధవారం జరిగిన విపక్షాల సమావేశంలోనూ లాలూ ప్రసాద్ యాదవ్ నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ‘ రాహుల్ జీ అభి భీ సమయ్ జ్యాదా బీతా నహీ హై, ఆప్ షాదీ కరీయే. (రాహుల్ గారూ మీకు ఇంకా సమయం ఉంది, దయచేసి పెళ్లి చేసుకోండి.) మీరు పెళ్లి చేసుకుంటే నేను ‘బారాతి’గా ఉండాలని అనుకుంటున్నాను.’’ అని సరదాగా చెప్పారు. ‘‘మీరు పెళ్లి చేసుకోండి. తన మాట వినడం లేదని మీ అమ్మ ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకా సమయం మించిపోలేదు. మీ వివాహ వేడుకల్లో మేమంతా ‘బారాతి’గా ఉంటాం ’’ అని అన్నారు.

ALso Read: ‘రాహుల్ గాంధీ మీకింకా సమయం మించి పోలేదు, పెళ్లి చేసుకోండి’- పాట్నా సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్.. వీడియో వైరల్

దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘ఆప్నే కేహ్ దియా తో హో జాగీ (మీరు చెబితే అది జరుగుతుంది..)’’ అని బదులిచ్చారు. దీంతో ఆ సమావేశంలో ఉన్న నాయకులంతా సరదాగా నవ్వారు. కొంచెం గడ్డం కత్తిరించుకోవాలని కూడా రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. ‘‘ఎన్నికల్లో హిందూ, ముస్లింలు అంటూ పోటీ చేస్తున్నాన్నారు. హనుమంతుడి పేరుతో ఎన్నికల్లో పోటీ చేసినా ఈసారి ఆయన (హనుమంతుడు) రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ కు మద్దతు పలికారు. హనుమంతుడు ప్రతిపక్షాలకు అండగా నిలిచాడు’’ అని లాలూ వ్యాఖ్యానించారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్వహించిన ప్రతిపక్షలా మెగా ఈవెంట్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాల వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశం జరిగింది.