బీహార్ లోని పాట్నాలో శుక్రవారం నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవాలని ఆర్జేడీ అధినేత రాహుల్ గాంధీని లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు. దీనికి ఆయన సరదాగా ‘ మీరు చెబితే అయిపోతుంది’ అని జవాబిచ్చారు. 

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని బీహార్ లోని పాట్నాలో బుధవారం జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు. దీంతో అంత సేపు సీరియస్ గా సాగిన సమావేశంలో ఒక్క సారిగా నవ్వులు వినిపించాయి. ఈ ఇరువురి నేతల మధ్య కాసేపు సరదా సంభాషణ సాగింది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ‘రాహుల్ జీ అభి భీ సమయ్ జ్యాదా బీతా నహీ హై, ఆప్ షాదీ కరీయే. (రాహుల్ గారూ మీకు ఇంకా సమయం ఉంది, దయచేసి పెళ్లి చేసుకోండి.) మీరు పెళ్లి చేసుకుంటే నేను ‘బారాతి’గా ఉండాలని అనుకుంటున్నాను.’’ అని సరదాగా చెప్పారు. ‘‘మీరు పెళ్లి చేసుకోండి. తన మాట వినడం లేదని మీ అమ్మ ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకా సమయం మించిపోలేదు. మీ వివాహ వేడుకల్లో మేమంతా ‘బారాతి’గా ఉంటాం ’’ అని అన్నారు.

అయ్యో.. మంత్రి కాన్వాయ్ అనుకొని.. కేరళ ప్రతిపక్ష నాయకుడి కారుపైకి దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు..

దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘ఆప్నే కేహ్ దియా తో హో జాగీ (మీరు చెబితే అది జరుగుతుంది..)’’ అని బదులిచ్చారు. దీంతో ఆ సమావేశంలో ఉన్న నాయకులంతా సరదాగా నవ్వారు. కొంచెం గడ్డం కత్తిరించుకోవాలని కూడా రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. ‘‘ఎన్నికల్లో హిందూ, ముస్లింలు అంటూ పోటీ చేస్తున్నాన్నారు. హనుమంతుడి పేరుతో ఎన్నికల్లో పోటీ చేసినా ఈసారి ఆయన (హనుమంతుడు) రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ కు మద్దతు పలికారు. హనుమంతుడు ప్రతిపక్షాలకు అండగా నిలిచాడు’’ అని లాలూ వ్యాఖ్యానించారు.

Scroll to load tweet…

బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్వహించిన ప్రతిపక్షలా మెగా ఈవెంట్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాల వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశం జరిగింది.

బామ్మా.. నువ్వు గ్రేట్.. మనువరాళ్లను కాపాడేందుకు చిరుతపులితోనే వీరోచితంగా పోరాడిన వృద్ధురాలు..

పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం ముగిసిన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఇది మంచి సమావేశం అని, ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించాయని అన్నారు. వచ్చే నెలలో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో భావసారూప్యత కలిగిన పార్టీల తదుపరి సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ను రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీలు సిమ్లాలో సమావేశమవుతాయని ఖర్గే తెలిపారు. 2024లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాల్లో కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఎజెండాను రూపొందించేందుకు జూలైలో సిమ్లాలో మరోసారి సమావేశమవుతామని ఆయన చెప్పారు.