Assembly Election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల వాయిదాకు అవ‌కాశం లేదు !

Assembly Election 2022:వచ్చే ఏడాది (2022) ప్రారంభంలో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనావైర‌స్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై పున‌రాలోచించుకోవాల‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. అయితే, ఎన్నిక‌ల‌ను వాయిదాకు అవ‌కాశ‌మే లేద‌ని ఈసీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.
 

State Polls Unlikely To Be Postponed Amid Omicron Scare: Sources

Assembly Election 2022:వ‌చ్చే ఏడాది (2022)లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు అప్పుడే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలో స‌మాజ్‌వాదీ పార్టీ-భార‌తీయ జ‌న‌తా పార్టీ-కాంగ్రెస్ ల మ‌ధ్య కొన‌సాగుతున్న మాటల యుద్ధంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఎలాగైనా అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని ఆయా పార్టీలు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాయి. ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే మిగ‌తా రాష్ట్రాల్లోనే ఇదే త‌ర‌హా ప‌రిస్థితులు ఉన్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల‌పై క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప‌డెట్టుగా క‌నిపిస్తున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. అలాగే, కోవిడ్‌-19 కొత్త వేరియంట్ కేసులు అధికంగా న‌మోదుకావ‌డంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆలోచించుకోవాల‌ని న్యాయ‌స్థానాలు ఎన్నిక‌ల సంఘానికి సూచిస్తున్నాయి. అయితే, ఒమిక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశంలేదని ఎన్నికల సంఘం (ఈసీ) వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించాయి. 

Also Read: Dengue: ఢిల్లీపై డెంగ్యూ పంజా.. 9500 కేసులు, 23 మ‌ర‌ణాలు !

ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు వాయిదా వేయ‌కుండా షెడ్యూల్ ప్ర‌కార‌మే నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూలు ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఐదు రాష్ట్రాల్లో  క‌రోనా వైర‌స్ ప‌రిస్థితుల‌ను  గురించి ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజే్‌షభూషణ్‌తో  సోమ‌వారం భేటీ అయింది. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్ పై చ‌ర్చించ‌డంతో పాటు కోవిడ్‌పై ఓ  అంచనాకు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి గురించి ఆరోగ్య కార్యదర్శి ఈసీకి వివరించారు. ఈ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎన్నిక‌ల సంఘం ప్ర‌భుత్వాన్ని కోరింద‌ని అధికారులు తెలిపారు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాల్లో క‌రోనా ప‌రిస్థితులు, వ్యాక్సిన్ వివ‌రాల గురంచి ఎన్నిక‌ల సంఘం ప్ర‌స్తావిస్తూ.. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మణిపూర్‌లలో క‌రోనా వైర‌స్ మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసు కున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందనీ, ఉత్తరాఖండ్‌, గోవాలో 100 శాతం పూర్తయినట్లు పేర్కొంది. 

Also Read: Brazil Floods: బ్రెజిల్ ను ముంచెత్తిన వ‌ర‌ద‌లు.. ఎటుచూసినా వ‌ర‌ద నీరే.. !

ఇదిలావుండ‌గా, క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్  ఒమైక్రాన్‌ వ్యాప్తి  పెరుగుతున్న నేప‌థ్య‌లో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేయాలని అలహాబాద్‌ హైకోర్టు గురువారం ఎన్నిక‌ల సంఘానికి సూచించింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌న గురించి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఓ నిర్ణ‌యానికి రావాల‌ని తెలిపింది. ఎన్నికల సభలు, ర్యాలీలు నిషేధించాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించింది. ర్యాలీలను ఆపకపోతే క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ కంటే దారుణ ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశముంద‌ని కోర్టు హెచ్చరించింది. బెంగాల్‌లో ఎన్నికల వల్ల అనేకమంది కరోనా సోకి మరణించారనే విష‌యాన్ని గుర్తు చేసింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ఈసీ సభ్యులు మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించి.. సరైన నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. అయితే, ఎన్నిక‌ల సంఘం ఎన్నిల నిర్వ‌హ‌ణ‌కే మొగ్గు చూపుతున్న‌ద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: Telangana: తెలంగాణ‌లో క‌రెంట్ షాక్‌.. ఇక ఛార్జీల మోతే !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios