Telangana: తెలంగాణ‌లో క‌రెంట్ షాక్‌.. ఇక ఛార్జీల మోతే !

Telangana: తెలంగాణ‌లో విద్యుత్ వినియోగ‌దారుల‌కు క‌రెంట్ షాక్ కొట్ట‌బోతోంది. విద్యుత్ వినియోగ ఛార్జీలు భారీగా పెర‌గున్నాయి. ఏకంగా 6 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌లు టారిఫ్ ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాయి. ఈ భారం ప్రజలపై పడనుంది.  
 

Electricity Charges May Hike In Telangana

Telangana: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రెంట్ కోసం చాలా పోరాటాలే జ‌రిగాయి. విద్యుత్ వినియోగ బిల్లుల విష‌యంలో ప్ర‌జా ఆందోళ‌న‌ల్లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్ప‌డిన త‌ర్వాత విద్యుత్ ఛార్జీల భారం కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. అయితే, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో విద్యుత్ చార్జీల మోత మోగ‌నుంది. క‌రెంట్ ఛార్జీల పెంపున‌కు రంగం సిద్ధ‌మైంది. దీనికి అనుగుణంగా  విద్యుత్‌ ఉత్పత్తి రంగ సంస్థలు (డిస్కంలు) టారిఫ్‌ ప్రతిపాదనలను Electricity Regulatory Commission కు సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలికి  అందించినట్లు తెలుస్తోంది. మొత్తం 6,831 కోట్ల రూపాయ‌ల భారాల‌ను ప్రజ‌ల‌పై మోప‌డానికి డిస్కంలు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేశాయి. 

Also Read: Afghanistan: రాక్ష‌స పాల‌నకు నాంది.. ఆఫ్ఘాన్ తాలిబ‌న్ స‌ర్కారు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రెంట్ బిల్లుల పెంపున‌కు సంబంధించి విద్యుత్ ఉత్ప‌త్తి రంగ సంస్థ‌లు (డిస్కంలు) విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లికి పంపిన టారిఫ్ ప్ర‌తిపాద‌న వివ‌రాల ప్ర‌కారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పైస‌లు పెర‌గ‌నున్నాయి. అలాగే, వాణిజ్య వినియోగదారులకు 1రూ. పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను తెలంగాణ ఈఆర్సీ Electricity Regulatory Commissionకి సమర్పించాయి డిస్కంలు. ఎల్‌టీ వినియోగ దారుల‌కు ఛార్జీలు పెంచ‌డం ద్వారా రూ.2,110 కోట్లు, హెచ్‌టీ ఛార్జీల పెంపు ద్వారా రూ.4,721 కోట్ల ఆదాయం పెరుగుతుంద‌ని లెక్క‌గ‌ట్టారు. ఇక డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు అందించాయి. సోమ‌వారం నాడు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.ర‌ఘురామారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఏ.గోపాల రావు ..టీఎస్ ఈఆర్సీ చైర్మెన్ త‌న్నీరు శ్రీ‌రంగా రావుకు ఈ టారిఫ్ ప్ర‌తిపాద‌న‌లు అందించారు. ఈ సంద‌ర్భంగా గ‌త ఐదేండ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేద‌నీ, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లోనే పెంచాల్సి వ‌స్తున్న‌ద‌ని ఇద్దరు సీఎండీలు వెల్ల‌డించారు.  రైల్వే చార్జీలు,బొగ్గు,బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని  టీఎస్ ఎస్పీడిఎసిఎల్ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు.

Also Read: Rakesh Tikait: ప్ర‌ధాని మోడీ నుంచి క్ష‌మాప‌ణ‌లు కోరడం లేదు కానీ.. రాకేష్ టికాయ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు

కాగా, దాదాపు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం స‌మకూరే అవ‌శాలున్నాయి. ఈ భారమంతా వినియోగదారులైన ప్రజలపై పడనుంది. ఎల్.టీ (డొమెస్టిక్)కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా...రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌లు వెల్ల‌డించాయి. ఇదిలావుండ‌గా, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.  25.78 లక్షల పంపుసెట్లకు  24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉంది. కాగా, ఇప్ప‌టికే పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల పెరుగుద‌ల, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు సైతం ఆకాశాన్ని తాక‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే ల‌క్ష‌లాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో విద్యుత్ ఛార్జీలు పెంచాల‌నుకోవ‌డం ప్ర‌జానీకంపై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని నిపుణులు, సామాజిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Also Read: Omicron: కేర‌ళ‌లో ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. నైట్ క‌ర్ఫ్యూ.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios