స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో ఢిల్లీలో షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. షో నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అందుకే అనుమతి ఇవ్వడం లేదని కారణాన్ని పేర్కొన్నారు.
ఢిల్లీలో నిర్వహించాలని భావించిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో రద్దు అయ్యింది. నగరంలో షో చేయడానికి ఢిల్లీ పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. ఈ ప్రదర్శన నిర్వహించడం వల్ల నగరంలో మత సామరస్యం దెబ్బతింటుందని పోలీసుల లైసెన్సింగ్ యూనిట్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా అంతకు ముందు మునావర్ ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చేందుకు అనుమతి కోరారు. ఈ షో ఆగస్టు 28న ఢిల్లీలోని సివిల్ సెంటర్‌లో జరగాల్సి ఉంది.
టెకీలకు సైకిల్ దొంగ బురిడీ, 100 బైస్కిళ్ల చోరీ.. లబోదిబో మంటున్న ఉద్యోగులు..
ఇదిలా ఉండగా.. మునవ్వర్ ఫరూఖీ షోను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. ఫరూఖీ ప్రదర్శన జరిగితే వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నిరసనలు తెలుపుతాయని పేర్కొంది. ఈ మేరకు వీహెచ్‌పీ ఢిల్లీ అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గుప్తా పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
‘‘మునావ్వర్ ఫరూఖీ అనే కళాకారుడు ఆగస్టు 28న ఢిల్లీలోని సివిక్ సెంటర్‌లోని కేదార్‌నాథ్ స్టేడియంలో ఒక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ వ్యక్తి తన షోలో హిందూ దేవతలను ఎగతాళి చేసాడు, దాని కారణంగా ఇటీవల భాగ్యనగర్‌లో మత ఉద్రిక్తత చెలరేగింది, ఈ ప్రదర్శనను రద్దు చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. లేనిపక్షంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ సభ్యులు ప్రదర్శనను నిరసిస్తారు. ’’ అని ఆయన పేర్కొన్నారు.
ఎస్ యూవీ కారులో వచ్చి దొంగతనం చేస్తారు.. పోలీసులకు చిక్కకుండా తిరుగుతారు.. కానీ చివరికి..
కాగా.. వాస్తవానికి ఈ షో కేదార్‌నాథ్ సాహ్ని ఆడిటోరియంలోని డాక్టర్ ఎస్‌పీఎం సివిక్ సెంటర్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు జరగాల్సి ఉంది. ఇది ప్రయివేటుగా నిర్వహించే షో. దీనికి ముందుగా అధికారులు అనుమతి ఇచ్చారు. అంతకు ముందు గత వారంలో బెంగళూరులో షో నిర్వహించాల్సి ఉంది. అయితే అతడి అనారోగ్య కారణాల వల్ల అది రద్దు అయ్యింది. మరుసటి రోజు హైదరాబాద్‌లో ఆయన ప్రదర్శన ఇచ్చాడు. తరువాత రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీనే.. మల్లీకార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు..
ఈ సంవత్సరం మే నెలలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరించిన రియాలిటీ షో ‘లాక్-అప్’ లో ఫరూకీ పాల్గొన్నారు. 18 లక్షలకు పైగా ఓట్లు పొంది విజేతగా నిలిచారు. ట్రోఫీని గెలుచుకున్నాడు. ఇదిలా ఉండగా.. హిందూ దేవతలతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ లక్ష్మణ్ సింగ్ గౌడ్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఫరూఖీతో పాటు మరో నలుగురిని ఈ ఏడాది జనవరి 1న మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ రోజున ఇండోర్‌లోని ఒక కేఫ్‌లో కామెడీ షో సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
