వారి వృత్తి దొంగతనం. అలా వచ్చిన డబ్బులతో కార్లు కొనుగోలు చేశారు. దొంగతనం చేయడానికి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ కార్లనే ఉపయోగించేవారు. కానీ ఒక రోజు పోలీసులకు చిక్కారు.
వాళ్లు చేసేది జేబు దొంగతనం. అయితే తమమై ఎవరికీ అనుమానం రాకూడదని కార్లలో తిరిగేవారు. అయితే అవేవీ మామూలువి కాదు.. లగ్జరీ గా ఉండే ఎస్ యూవీ కార్లు. వాటిల్లోనే వచ్చి దొంగతనం చేసేవారు. పోలీసులకు చిక్కుండా తిరిగేవారు. కానీ ఇలాంటి ఆటలు ఎక్కువ రోజులు సాగవు కదా.. ఇక్కడ కూడా అలాగే జరిగింది. దాదాపు 12 ఏళ్లుగా గుజరాత్ లో వందలాది మంది దగ్గర దొంగతనం చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు.
గుజరాత్ లోని గిరి సోమనాథ్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ ఠాకోర్, అతడి భార్య గీత, మరో వ్యక్తి నరేష్ భాభోర్ అతడి భార్య రేఖలు గత 12 ఏళ్లుగా గుజరాత్ లోని అనేక నగరాలు, పట్టణాల్లో దొంగతనాలు చేస్తున్నారు. ఈ రెండు జంటలు ఇప్పటి వరకు 339 పిక్ పాకెట్ నేరాలు చేశాయి. వీరు దాహోద్ జిల్లాకు చెందిన వారు. సాధారణంగా కూలి పని చేయడం ద్వారా అధిక డబ్బులు సంపాదించలేమనే ఆలోచనతో దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నారు.
కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీనే.. మల్లీకార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు..
ఆగస్టు 22వ తేదీన వెరావల్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా నికితా కొడియాటర్ అనే మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. తిరిగి ఓ రద్దీ గా ఉండే బస్సులో మంగళూర్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తన ఐఫోన్, రూ.5 వేలను పొగొట్టుకుంది. అదే రోజు ఉషా కనబర్ అనే మరో మహిళ కూడా సోమనాథ్ ప్రాంతంలో తన పర్సులో నుంచి రూ.11 వేలు పొగొట్టుకుంది. వీరిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జేబు దొంగలపై నిఘా పెట్టారు.
అదే రోజు పోలీసులు బస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా.. ఓ బ్రెజ్జా కారు లోపలికి రావడం,అందులో నుంచి ఇద్దరు మహిళలు దిగడం కనిపించింది. అయితే వారిద్దరు బస్సు వరకు నడిచారు కానీ బస్సు ఎక్కలేదు. కొంత సమయం తరువాత SUV లో బయలుదేరారు. ఇలాంటి దృశ్యమే అంతకు ముందు రోజు (ఆగస్టు 21వ తేదీ) నాటి సీసీటీవీ పుటేజీలో కనిపించింది. అయితే ఆ మహిళల వద్ద ఎలాంటి సామాన్లూ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ కారు ఎక్కడుందనే విషయాన్ని గుర్తించారు. వెరావల్లోని ఇండియన్ రేయాన్ ఫ్యాక్టరీ సమీపంలో ఆ కారును పట్టుకున్నారు. అయితే ఈ దొంగతనం చేసే సమయంలో మగవాళ్లు వేరే కారులో ప్రయాణించేవారని పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశంలో ఎక్కువ మంది పురుషులు ఉంటే, భర్తలు అందులోకి ప్రవేశించి జేబు దొంగతనాలు చేయగా.. మహిళలు ఉంటే భార్యలు దొంగతనాలు చేసే వారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను పట్టుకొని చోరీకి గురైన రూ.16 వేల నగదు, ఐఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పన్ను చెల్లింపుదారుల నిధుల వ్యయంతో ఉచితాలు రాష్ట్రాల దివాలాకు దారితీయవచ్చు: సుప్రీం కోర్టు
నిందితుల వద్ద పలు ఫోన్లు, రూ.96,800 నగదుతో మూడు ఏటీఎం కార్డులు, 8 ఆధార్ కార్డులు, పలు
ఎన్నికల గుర్తింపు కార్డులు, పాన్ కార్డులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పిక్ పాకెట్ పర్సులలో దొరికిన డబ్బుతో వారు ఆరు లక్షల రూపాయల విలువైన కారును కొనుగోలు చేశారు అని గిర్-సోమ్ నాథ్ పోలీసు సూపరింటెండెంట్ మనోహర్ సింగ్ జడేజా తెలిపారు.
