Asianet News TeluguAsianet News Telugu

టెకీలకు సైకిల్ దొంగ బురిడీ, 100 బైస్కిళ్ల చోరీ.. లబోదిబో మంటున్న ఉద్యోగులు..

బెంగళూరులో ఓ సైకిళ్ల దొంగ చేసిన పనికి టెకీలు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక తలలు పట్టుకుంటున్నారు. సైకిల్ మీది ప్రేమ తమకు ఇక్కట్లు తెచ్చిపెట్టిందని వాపోతున్నారు. 

Bicycle thief takes Bengaluru cops and techies for a ride
Author
First Published Aug 27, 2022, 1:21 PM IST

బెంగళూరు : బెంగళూరులోని సైక్లింగ్ ప్రేమికులైనా టెకీలకు షాక్ తగిలింది. బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని బాగ్‌మనే సోలారియం సిటీలో ఒక్కసారిగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. పార్క్ చేసి ఉన్న సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో టెకీలు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. వివరాల్లోకి వెడితే.. 

గతవారం తాళం వేసి ఉన్న తమ సైకిళ్లు దొంగిలించబడ్డాయని రెండు ఫిర్యాదులు, వెంటవెంటనే అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సైకిళ్ల దొంగను పట్టుకుని విచారించగా.. అతను అప్పటివరకు 100 సైకిళ్లను దొంగిలించాడని తేలింది. వీటిని సైకిళ్లంటే ఇష్టపడే టెకీలకు అమ్మాడని తేలడంతో పోలీసులు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, అవి తమ సొంత సైకిళ్లని దొంగ సైకిళ్లు కావని చెబుతున్న టెకీలతో వారికి నిరూపించుకోవడానికి పది నిముషాల సమయం ఇచ్చారు పోలీసులు. సైకిల్ కొన్న బిల్లు లాంటి మరేదైనా ఆధారం చూపిస్తే సైకిల్ వదిలేస్తామని లేకపోతే.. పోలీస్ స్టేషన్ కు వచ్చి కలెక్ట్ చేసుకోమని తెలిపారు. దీంతో టెకీలు పోలీసులు తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. 

నైట్ క్లబ్‌లలో ఎదుటి వ్యక్తిని అనుమతి లేకుండా తదేకంగా చూడటం నిషేధం... ఎక్కడో తెలుసా?

వీరిలో చాలామంది సైకిళ్లను సొంత ఊర్లనుంచి ఇక్కడికి తెచ్చుకున్నవారు. వీటిల్లో కొన్ని ఐదేళ్ల పాతవి. దీంతో వాటికి సంబంధించిన రిసిప్ట్ లు దొరకడం కష్టంగా మారింది. బెంగళూరు సైకిల్ ఫ్రెండ్లీ అని తెలిసి తాము.. ఆఫీసులకు సైకిళ్ల మీద వస్తున్నామని.. పోలీసుల తీరు తమను తీవ్రంగా కలిచి వేసిందని వారు అంటున్నారు. అంతేకాదు మమ్మల్ని దొంగల్లా చూశారు. పోలీస్ స్టేషన్లో 3,4 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. మేమూ బాధ్యతగల పౌరులమే దొంగసొత్తు కొనం.. అంటూ మరో టెకీ ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక టెకీ మాట్లాడుతూ.. పోలీసులతో మాకు భాషా సమస్య కూడా వచ్చింది. మేము చెప్పేది వారికి అర్థం కావడం లేదు. మాకు వారు చెప్పేది అర్తం కాక ఇబ్బందులు పడ్డాం.. అన్నారు. దీనిమీద ఐటీ కంపెనీ యజమాని ఒకరు మాట్లాడుతూ.. కరోనా తరువాత అత్యంత కష్టంగా ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారు. ఇలాంటి ఘటనలతో మళ్లీ తీవ్రప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇక దీనిమీదమహదేవపుర పోలీసులు  పోలీసులు ఏం చెబుతున్నారంటే.. తమకు ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేసి.. సైకిళ్ల దొంగను పట్టుకున్నాం.. అయితే ఆ దొంగ అప్పటికి 100 సైకిళ్లను దొంగిలించాడని తేలింది. వాటిని అతను టెకీలకు అమ్మానని తెలిపాడు. అందులో 32 సైకిళ్లను నగరంలోని పలు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నాం. 14 సైకిళ్లను వాటి ఓనర్స్ ఆధారాలు చూపిండంతో టెకీలకు తిరిగి ఇచ్చేశాం. అయితే, దొంగ వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ఒకవేళ సైకిళ్లు పాతవి అయితే.. సైకిల్‌తో దిగిన ఫోటోలు లేదా అపార్ట్‌మెంట్ లేదా ఆఫీసుల్లోని పాత సిసిటివి ఫుటేజీ వంటి ఏదైనా ఇతర రుజువులు చూపించి సైకిల్‌ తమదేనని టెకీలు నిరూపించుకోవచ్చు అన్నారు. 

తాము టెకీలకు చెందిన సైకిళ్లేవీ స్వాధీనం చేసుకోలేదని పోలీసులు అంటున్నారు. అంతేకాదు.. డీసీపీ (వైట్‌ఫీల్డ్) ఎస్ గిరీష్ మాట్లాడుతూ.. నిందితులు 12 సైకిళ్లను సెక్యూరిటీ సిబ్బందికి రూ. 2,000-రూ. 3,000 ధరకు విక్రయించారని, వాటి అసలు ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 మధ్య ఉంటుందని పేర్కొన్నారు. దొంగిలించబడిన సైకిళ్లన్నీ క్యాంపస్‌లో సైకిళ్ల మీద తిరిగే సెక్యూరిటీ వింగ్ సిబ్బందికి అమ్మాడు. దొంగిలించబడిన సైకిళ్లను ముఖ్యంగా  టెక్ పార్క్‌లో పనిచేస్తున్న వాళ్లే ఎక్కువగా కొన్నారు. అందుకే పోలీసులు అనుమానితుల సైకిళ్లను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఓనర్ షిప్ రుజువు చేసుకుంటే.. సైకిళ్లను విడిచిపెడుతున్నాం.. అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios