Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్ లో ‘సిత్రాంగ్’ విలయతాండవం.. 16కు చేరిన మృతుల సంఖ్య.. కరెంటు లేక 10 మిలియన్ల మంది అవస్థలు

సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను ప్రభావం వల్ల ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 

Sitrang disaster in Bangladesh.. death toll reaches 16.. 10 million people in dire straits without electricity
Author
First Published Oct 25, 2022, 3:50 PM IST

బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాను విలయతాండవం చేస్తోంది. ఈ తుఫాను ప్రభావం వల్ల చనిపోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 16కి చేరింది. సుమారు లక్ష మంది తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్తు లేకుండా చీకట్లోనే మగ్గుతున్నారు. దక్షిణ, నైరుతి ప్రాంతాలలో భారీ వర్షాల వల్ల పాఠశాలలను మూసివేశారు. 

సిత్రాంగ్ తుఫాను సోమవారం రాత్రి బంగ్లాదేశ్‌లో తీరం దాటింది. అయితే వాతావరణం ఇంత భయంకరంగా మారిపోకముందే అధికారులు సుమారు పది మిలియన్ల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. కాగా.. ఇప్పటి వరకు సంభవించిన మరణాలపై విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమ్రుల్ అహ్సాన్ వార్తా సంస్థ ‘ఏఎఫ్పీ’తో మాట్లాడుతూ.. తుఫాను వల్ల కురుస్తున్న వర్షాలు, చెట్లు కూలిపోవడం వల్ల 14 మంది చనిపోయారని, ఉత్తరాన జమున నదిలో ఒక పడవ మునిగిపోవడంతో ఇద్దరు మరణించారని చెప్పారు.

శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం.. అక్కడ జరుగుతన్న పనులపై గ్రౌండ్ రిపోర్ట్..

తుఫాను కేంద్రానికి వందల కిలోమీటర్ల (మైళ్లు) దూరంలో రాజధాని ఢాకా వరకు చెట్లు నేలకూలాయి. సోమవారం నాడు 324 మిల్లీమీటర్లు (13 అంగుళాలు) వర్షపాతం నమోదయిన ఢాకా, ఖుల్నా, బరిసాల్ వంటి నగరాలను వరదలు ముంచెత్తాయి. మయన్మార్ నుండి దాదాపు 33,000 మంది రోహింగ్యా శరణార్థులు, వివాదాస్పదంగా ప్రధాన భూభాగం నుండి బంగాళాఖాతంలోని తుఫాను పీడిత ద్వీపానికి తరలించారు. 

దక్షిణ ద్వీపమైన మహేశ్‌ఖాలీలో తుఫాను ప్రభావం వల్ల అనేక చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్, టెలికాం సేవలు నిలిచిపోయాయి. కరెంటు లేకపోవడంతో ఒక్క సారిగా ఆ ప్రాంతంలో చీకట్లు అలుముకున్నాయి. ఈ సమయంలో చాలా ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. పలువురు ఇళ్లలోకి పాములు కూడా వచ్చాయని బాధితులు ఏఎఫ్పీకి తెలిపారు. అత్యధికంగా ప్రభావితమైన బారిసల్ ప్రాంతంలో కూరగాయల పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కు సమీపంలో ఉన్న భారత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ లో కూడా ఈ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. సోమవారం వేలాది మంది ప్రజలను 100 కంటే ఎక్కువ సహాయ కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టమూ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. సహాయ శిబిరాలకు వెళ్లిన పలువురు మంగళవారం తమ ఇళ్లకు తిరిగివచ్చారు. 

ఇటానగర్ లో అగ్నిప్రమాదంలో 700 దుకాణాలు దగ్ధం: అగ్నిమాపక సిబ్బందిపై స్థానికుల ఫైర్

కాగా.. గతేడాది గంటకు 155 కిలోమీటర్ల (96 మైళ్ళు) వేగంతో సంభవించిన యాస్ తుఫాను వల్ల భారతదేశ తూర్పు తీరం వెంట ఉన్న ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాన్ కేటగిరీ 2 హరికేన్‌కు సమానం. 2020లో బంగాళాఖాతంలో సంభవించిన రెండో సూపర్ సైక్లోన్ అంఫాన్ తుఫాను వల్ల బంగ్లాదేశ్, భారతదేశంలో 100 మందికి పైగా మరణించారు. మిలియన్ల మందిపై ప్రభావం చూపింది. 

ఇటీవలి కాలంలో ఈ తుఫానుపై సమర్థవంతమైన అంచనా, అలాగే ప్రభావంతమైన తరలింపు ప్రణాళిక వల్ల మరణాల సంఖ్య తక్కువగా నమోదు అవుతోంది. 1970లో వచ్చిన భారీ తుఫాన్ వల్ల వేలాది మంది చనిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios