అరుణాచల్  ప్రదేశ్ లో ఇవాళ  జరిగిన అగ్ని ప్రమాదంలో  700  దుకాణాలు దగ్దమయ్యాయి.కోట్లలో ఆస్థి నష్టం చోటు చేసుకుందని అధికారులు  తెలిపారు.మూడు ఫైరింజన్లు  గంటల తరబడి  శ్రమించి  మంటలను ఆర్పాయి.

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లోని నహర్లాగన్ డైలీ మార్కెట్ లో మంగళవారం నాడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 700 దుకాణాలుఅగ్నికి ఆహుతయ్యాయి.ఇవాళ ఉదయం నాలుగు గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది . అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన మార్కెట్ గా ఈ మార్కెట్ పేరొందింది.రాష్ట్ర రాజధాని ఇటానగర్ కు 14 కి.మీ దూరంలో ఈ మార్కెట్ ఉంది. పోలీస్ స్టేషన్ ,అగ్నిమాపక స్టేషన్లకు కూడా ఈ మార్కెట్ సమీపంలో ఉంది.

దీపావళి సందర్భంగా టపాకాయలు పేల్చడం వల్ల లేదా దీపాలు వెలిగించడం వల్ల మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించినా కూడ నష్టాన్నినివారించలేకపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వెదురు బొంగులతో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో మంటలు త్వరగా మ వ్యాపించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఎల్ పీజీ సిలిండర్లు కూడ ఈ అగ్ని ప్రమాదంలో పేలాయి. గ్యాస్ సిలిండర్ల పేలుడు కూడ మంటలు ఇంకా త్వరగా వ్యాప్తి చెందేందుకు దోహదం చేసిందని పోలీసులు చెబుతున్నారు.ఈ మంటలను ఆర్పివేయడానికి గంటల సమయం తీసుకుంది. మూడు పైరింజన్లు మంటలను ఆర్పాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని అగ్నిమాపక సిబ్బంది స్పందించలేదని కొందరు దుకాణదారులు ఆరోపించారు. 

అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వచ్చిన సమయంలోఫైరింజన్లలో నీళ్లు లేవని స్థానికులు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పెద్దఎత్తున దుకాణాలు దగ్దమయ్యాయని స్థానికులు చెబుతున్నారు.