Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక సీఎం రేసులో సిద్ధరామయ్య ముందంజ.. బ్యాలెట్ ఓటింగ్ లో ఆయన వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యే ఉండాలని కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ విషయంపై ఆదివారం రాత్రి బ్యాలెట్ పద్దతిలో ఎమ్మెల్యేలతో ఓటింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. అందులో అధిక ఓట్లు సిద్ధరామయ్యకే అనుకూలంగా వచ్చినట్టు సమాచారం. 

Siddaramaiah is leading in the Karnataka CM race. MLAs are leaning towards him in the ballot voting..ISR
Author
First Published May 15, 2023, 2:29 PM IST

దేశ మొత్తం ఇప్పుడు కర్ణాటక సీఎం ఎవరనే విషయంపైనే చూపు నిలిపింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోనుంది. అయితే సీఎం ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. దీని కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో అధిష్టానం ఆదివారం అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించింది. 

లా అండ్ ఆర్డర్ పై నమ్మకం ఉంచండి.. నిరసన విరమించండి - రెజర్లకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపు

సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కంటే, మాజీ సీఎం సిద్ధరామయ్య వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తేలింది. 80 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తున్నారని బ్యాలెట్ ఓటింగ్ లో వెల్లడైనట్టు ‘టైమ్స్ నౌ’ కథనంలో పేర్కొంది. అయితే డీకే శివ కుమార్ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్ణాటక సీఎంను నిర్ణయించేందుకు కాంగ్రెస్ పార్టీ బెంగళూరులోని ఓ హోటల్లో ఆదివారం సాయంత్రం సమావేశం ప్రారంభించింది. ఈ సమావేశం అర్ధరాత్రి 1.30 గంటల వరకు సాగింది. ఇందులో కొత్తగా ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ జాతీయ నాయకుడు సుశీల్ కుమార్ షిండే,  ఏఐసీసీ ఇంచార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, అలాగే సీఎం అభ్యర్థులుగా ఉన్న డీకే శివ కుమార్, సిద్ధరామయ్య హాజరయ్యారు. ఇందులో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకొని, వాటిని హైకమాండ్ కు పంపించినట్టు తెలుస్తోంది. ఇక సీఎం ఎవరనే విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది.

విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి, 30 మందికి పైగా అస్వస్థత..

ఇదిలా ఉండగా.. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని హైకమాండ్ ఆ ఇద్దరు నాయకుల వద్ద ప్రతిపాదన పెట్టినట్టు ఆదివారం వరకు వార్తలు వినిపించాయి. శివకుమార్ తో ముఖ్యమంత్రి పదవిని పంచుకునేందుకు సిద్దరామయ్య సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే సిద్ధరామయ్య మాత్రం మొదటి టర్మ్ ను కోరుకుంటున్నారని, మొదటి రెండేళ్ల తర్వాత ఆయన పదవి నుంచి వైదొలుగుతానని చెప్పినట్టు సమాచారం. కానీ ఈ ప్రతిపాదనకు శివ కుమార్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

దారుణం.. భార్యను హతమార్చి, మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచిన భర్త.. ఎక్కడంటే ?

కాగా.. ఈ ఇరువురి నేతలను హైకమాండ్ సోమవారం ఢిల్లీకి పిలిచింది. కానీ ఈ రోజు తన పుట్టిన రోజు అని, ఆదివారం జరిగిన సమావేశంలో తమ (కాంగ్రెస్) తీర్మానాన్ని ఆమోదించామని, ఇక హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘‘నేను ఢిల్లీకి వెళ్లను. ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి ప్రజలను కలుస్తాను. న్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను’’ అని ఆయన మీడియాతో తెలిపారు. మరోవైపు కర్ణాటక తదుపరి సీఎంను నిర్ణయించేందుకు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య నేడు ఢిల్లీకి వెళ్లారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios