ఓ భర్త తన భార్యను దారుణంగా హతమార్చి, శవాన్ని బెడ్ బాక్స్ లో దాచిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని చోటు చేసుకుంది. అనంతరం తాగిన మత్తులో చేసిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను చంపేసి, మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. దానిని 24 గంటల పాటు అందులోనే ఉంచాడు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. మృతురాలిని దీపా పర్మార్ (40)గా గుర్తించారు.

ఫిట్టింగ్ సూట్, సన్ గ్లాసెస్ తో కొత్త లుక్ లో జైశంకర్.. ఫొటో వైరల్.. హాలీవుడ్ స్టార్ లా ఉన్నారంటూ కామెంట్లు

వివరాలు ఇలా ఉన్నాయి. ఉజ్జయిని జిల్లా నర్వార్ లోని పాలఖండ గ్రామానికి చెందిన దీపా పర్మార్ కు కొన్ని 1996లో విజయ్ అనే వ్యక్తితో వివాహమైంది. కొంత కాలం నుంచి ఇద్దరు భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యపై విజయ్ కోపం పెంచుకున్నాడు. గత బుధవారం రాత్రి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం దీపా పర్మార్ మృతదేహాన్ని బెడ్ బాక్సులో దాచి పెట్టాడు.

మోచా బీభత్సం.. మయన్మార్‌ లో ముగ్గురు మృతి.. రఖైన్ ను తాకిన తరువాత బలహీన పడిన సైక్లోన్..

తరువాత తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు దీపా కనిపించడం లేదని అబద్దం చెప్పాడు. అది నిజమని నమ్మిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. దాదాపు 24 గంటల పాటు గాలించిన దీపాకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ లభించలేదు. అయితే గురువారం రాత్రి మద్యం మత్తులో విజయ్.. దీపను హత్య చేశానని, శవాన్ని బెడ్ బాక్స్ లో దాచిపెట్టానని తల్లికి చెప్పాడు.

కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్..? అర్ధరాత్రి వరకు సాగిన సీఎల్పీ సమావేశం..

దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

కాగా.. గతంలో కొన్ని కుటుంబ కలహాల వల్ల వినయ్ పై దీపా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భర్త ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. తన సోదరిని ఆమె భర్త వినయ్ తో సహా అత్తమామలే హత్య చేశారని దీపా సోదరుడు హేమంత్ ఆరోపించారు.