Asianet News TeluguAsianet News Telugu

లా అండ్ ఆర్డర్ పై నమ్మకం ఉంచండి.. నిరసన విరమించండి - రెజర్లకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపు

లా అండ్ ఆర్డర్ పై నమ్మకం ఉంచి నిరసనను విరవించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజర్లకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఇప్పటికే కమిటీ వేశామని చెప్పారు.

Have faith in law and order.. Stop protesting - Union Minister Anurag Thakur's call to the protesters..ISR
Author
First Published May 15, 2023, 1:40 PM IST

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, సాక్షి మల్లిక్ తో పాటు పలువురు రెజర్లు చేస్తున్న నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరంతా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. అయితే వీరి ఆందోళన పట్ల కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. లా అండ్ ఆర్డర్ పై నమ్మకం ఉంచాలని, నిరసనను విరమించాలని ఆయన రెజర్లను కోరారు. 

జాతీయ రాజకీయాలకు బీఆర్ఎస్ విరామం.. ప్రస్తుతానికి ఫోకస్ అంతా తెలంగాణ పైనే.. కర్ణాటక ఫలితాలే కారణం ?

ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఢిల్లీ పోలీసులు కూడా వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై కమిటీని ఏర్పాటు చేశామని, రెజ్లర్ల సమస్యలను కూడా విన్నామని చెప్పారు. ‘‘ రెజ్లింగ్ ఫెడరేషన్ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించడానికి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. అథ్లెట్ల కోసం ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యాయి. వారు నిరసనను విరమించి దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలి’’ అని కేంద్ర క్రీడా మంత్రి ఆదివారం హమీర్పూర్ లో మీడియాతో అన్నారు. 

‘‘సుప్రీంకోర్టు తన తీర్పు ఇచ్చింది. ఢిల్లీ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. మేజిస్ట్రేట్ వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నారు. శాంతిభద్రతలపై వారికి నమ్మకం ఉంచి నిరసనను విరమించుకోవాలి.’’ అని చెప్పారు.

విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి, 30 మందికి పైగా అస్వస్థత.. 

కాగా.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎగ్జిక్యూటివ్ కమిటీకి 45 రోజుల్లోగా ఎన్నికలను నిర్వహించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఏప్రిల్ 24న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అథ్లెట్ల ఎంపిక, అంతర్జాతీయ ఈవెంట్లలో క్రీడాకారుల భాగస్వామ్యం కోసం ఎంట్రీలు చేయడం సహా సంస్థ రోజువారీ వ్యవహారాలను నిర్వహించడాని ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించే వరకు ఈ కమిటీ పనిచేస్తుంది.

ఇదిలా ఉండగా.. నిరసన తెలుపుతున్న రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు బృందం ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలకు వెళ్లి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను సేకరించింది. ఆయన విదేశీ పర్యటనల్లో ఎదుర్కొన్న ఆరోపణలపై మరింత తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు విదేశీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సాక్ష్యాలుగా ఫొటోలు, వీడియోలను పోలీసులు సేకరించారు.

దారుణం.. భార్యను హతమార్చి, మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచిన భర్త.. ఎక్కడంటే ?

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింప్ పై వచ్చిన లైంగిక నేరానికి సంబంధించి మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ పోలీసులు శుక్రవారం స్టేటస్ రిపోర్టు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు నోటీసు మేరకు ఏప్రిల్ 28న ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. కాగా.. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బీజేపీ ఎంపీ సింగ్ ను అరెస్టు చేయాలని, రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలోని జంతర్ మంతర్ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios