కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటక రాజకీయం ముదిరి పాకానపడింది. ఎమ్మెల్యేలను రక్షించేందుకు క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పరిస్ధితిని బీజేపీ నిశితంగా గమనిస్తోంది.

తాజా రాజకీయ పరిస్థితిపై స్పందించారు మాజీ సీఎం, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సమన్వయకర్త. ‘‘ ఇది కేవలం బీజేపీ ఆపరేషన్ కమల్‌లో భాగమేనని.. ఎలాంటి దిగులు చెందాల్సిన పనిలేదన్నారు.

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని సిద్ధూ స్పష్టం చేశారు. రాజీనామా చేసినట్లుగా చెబుతున్న 5, 6 మంది ఎమ్మెల్యేలతో అందుబాటులో ఉన్నానని అయితే వారి వివరాలు ఇప్పుడే చెప్పను అని ఆయన వెల్లడించారు.

ప్రతి ఒక్కరు పార్టీకి నమ్మకంగా ఉన్నారని సిద్ధరామయ్య తెలిపారు. మరోవైపు కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక సిద్ధరామయ్య హస్తం వుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. దీనికి బలాన్నిస్తూ.. సిద్ధూ సీఎం అయితే తాము రాజీనామాల వనుంచి తప్పుకుంటామని ఎమ్మెల్యేలు సైతం ప్రకటించడం కన్నడనాట కలకలం రేపింది. 
రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ముంబైకు

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం: దేవేగౌడతో శివకుమార్ భేటీ

కర్ణాటక క్రైసిస్: రంగంలోకి శివకుమార్, నలుగురు ఎమ్మెల్యేలు వెనక్కి

కుమారస్వామికి ఎసరు: మరో 8 మంది ఎమ్మెల్యేల రాజీనామా (వీడియో)