జమ్మూ కాశ్మీర్ లో లష్కరే తోయిబాా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టబెట్టాయి. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోగా మరోఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు తెలుస్తోంది.
India Pakistan : జమ్మూ కాశ్మీర్ మరోసాారి తుపాకీ మోతతో దద్దరిల్లింది. షోపియాన్‌లోని జిన్‌పాతర్ కేలర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, సెక్యూరిటీ ఫోర్సెస్ పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబాకు చెందినవాడిగా గుర్తించారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టారు. దీంతో ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా ఉగ్రవాదులను అంతమొందించేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
పహల్గా ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన పాకిస్థానీ ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హాషిమ్ మూసా 'టెర్రరిస్ట్ ఫ్రీ కాశ్మీర్' పోస్టర్లు అతికించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడిలో ఈ ముగ్గురూ కీలక పాత్ర పోషించారు.
ఆదిల్ హుస్సేన్ థోకర్ పాకిస్తానీ ఉగ్రవాదులకు సాయం చేశాడు
ఈ ముగ్గురు ఉగ్రవాదుల పోస్టర్లు జమ్మూ కాశ్మీర్ అంతటా అతికించారు. ఆదిల్ హుస్సేన్ థోకర్ పాకిస్తానీ ఉగ్రవాదులకు సాయం చేశాడు. ఈ ఉగ్రవాదులు పహల్గాం బైసరన్ లోయలో దాడి చేశారు. పహల్గాం దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఏప్రిల్ 25న బిజ్‌బెహెరాలో థోకర్ ఇంటిని అధికారులు IEDతో పేల్చేశారు. 2018లో థోకర్ అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. గత ఏడాది అతను మళ్ళీ లోయలోకి చొరబడ్డాడు.


