ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ‘నో వర్క్, నో పే’ నిబంధన ప్రవేశపెట్టిన ప్రభుత్వం..
సరైన కారణం లేకుండా ఆఫీసుకు రాని ఉద్యోగులపై మణిపూర్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధులకు రాకపోతే జీతం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సర్క్యులర్ జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం మణిపూర్ ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. సరైన కారణాలు లేకుండా ఏ అధికారి, ఉద్యోగి అయినా ఆఫీసులో కనిపించకుండా పోయినట్లయితే.. ఇక నుంచి వారికి జీతం అందదు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారణం సహేతుకమైన కారణాలు లేకుండా ఆఫీసులకు డుమ్మా కొట్టే వారికి జీతంలో కోత పడనుంది. ఉద్యోగులను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ - రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు..
ఈ విషయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ జారీ చేసిన ఆఫీస్ సర్క్యులర్‌లో ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితుల కారణంగా పోస్టింగ్ స్థలంలో కార్యాలయానికి వెళ్లలేని అధికారులను డిప్యూటీ కమిషనర్ లేదా లైన్ డిపార్ట్‌మెంట్ కు ఏరియా లెవెల్ ఆఫీసును అటాచ్ చేశారు. వారు అక్కడి నుంచి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది అధిరానేలే అటాచ్ చేసిన కార్యాలయాలకు హాజరు కావడం లేదని నివేదికలు ఉన్నాయి.’’ అని పేర్కొంది.
శెభాష్ రా బుడ్డోడా.. చిరుతను ఇంట్లో బంధించిన పిల్లాడు.. వీడియో వైరల్..
ఉద్యోగుల హాజరు కోసం డిప్యూటీ కమిషనర్లు, విభాగాలు, ఐఏఎస్ ల అధిపతులు రిజిస్టర్ ను నిర్వహించాలని సర్క్యులర్ పేర్కొంది. ఈ రిజిస్టర్ తో పాటు ఉద్యోగుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన సమస్య ఉంటే మరో రికార్డు కూడా నిర్వహించాలని పేర్కొంది. ఉద్యోగులకు జీతం పంపిణీ చేసే బాధ్యత కూడా ఉన్నతాధికారుల భాగస్వామ్యంతో ఉంటుందని తెలిపింది.
నేడు కాంగ్రెస్ సీఈసీ మీటింగ్.. లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ?
కాగా.. గత ఏడాది మేలో మణిపూర్‌లో కుకీ, మైతేయ్ వర్గాల మధ్య మొదలైన హింస ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఇప్పుడు కూడా ఆ ఈశాన్య రాష్ట్రంలో అడపాదడపా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మణిపూర్ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన 6746 మంది మయన్మార్ వలసదారులలో 259 మందిని తిరిగి వారి దేశానికి పంపినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మార్చి 4వ తేదీన అసెంబ్లీలో వెల్లడించారు. వారందరికీ బయోమెట్రిక్ తీసుకున్న తరువాత ఈ చర్యకు పూనుకున్నామని చెప్పారు.