శెభాష్ రా బుడ్డోడా.. చిరుతను ఇంట్లో బంధించిన పిల్లాడు.. వీడియో వైరల్..
12 ఏళ్ల బాలుడు చిరుత పులిని చూసి భయపడలేదు. ధైర్యంగా, సమయస్పూర్తితో ఆలోచించి దానిని బంధించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరుత పులి కనిపిస్తే సాధారణంగా ఎవరైనా చేస్తారు.. ? పెద్దగా అరుస్తూ, భయంతో అక్కడి నుంచి పారిపోతారు. మళ్లీ అటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ ఓ పిల్లాడు చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండరు. ఆ బాలుడు ఉన్న ఇంట్లోకి ఓ చిరుత పులి ప్రవేశించడంతో చాకచక్యంగా వ్యవహించి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ఆ పిల్లాడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముచ్చటగా మూడో సారి మోడీయే ప్రధాని.. ఎన్డీఏ కూటమికి 378 సీట్లు - ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్
అసలేం జరిగిందంటే ?
అది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ పట్టణం. అక్కడ ఉన్న ఓ ఆఫీస్ కాబిన్ లో సోఫాపై మోహిత్ విజయ్ అనే 12 ఏళ్ల బాలుడు కూర్చొని సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నాడు. అదే సమయంలో తెరిచి ఉన్న డోరు నుంచి మెళ్లగా ఓ చిరుత పులి లోపలకి ప్రవేశించింది. సోఫాలో బాలుడు కూర్చొని ఉన్న సంగతి ఆ చిరుత గమనించలేదు. ఆ బాలుడు ముందు నుంచే ఆ చిరుత మరో గదిలోకి ప్రవేశించింది.
ఆ చిరుత రావడాన్ని చూసిన మోహిత్ కంగారు పడలేదు. భయపడుతూ కేకలు వేయలేదు. ఆ మృగం మరో గదిలోకి వెళ్లగానే సమయస్పూర్తిగా వ్యవహరించి, మెళ్లగా సోఫాలో నుంచి లేచాడు. చప్పుడు లేకుండా బయటకు వెళ్లి, తలుపు వేసి, చిరుతను బంధించాడు. ఈ విషయాన్ని తరువాత తల్లిదండ్రులకు చెప్పాడు. వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
లోక్ సభ ఎన్నికల్లో 37 సీట్లకే కాంగ్రెస్ పరిమితం - ఇండియా టీవీ-సీఎన్ ఎక్స్ సర్వే అంచనా..
వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను రక్షించారు. అనంతరం అక్కడి నుంచి పులిని తీసుకెళ్లారు. కాగా.. మోహిత్ సోఫాపై కూర్చొని సెల్ ఫోన్ లో నిమగ్నమవడం, లోపలికి చిరుత ప్రవేశించి, మళ్లీ బాలుడు లేచి తలుపు వేడయం వంటివన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.