Asianet News TeluguAsianet News Telugu

నేడు కాంగ్రెస్ సీఈసీ మీటింగ్.. లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ?

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సాయంత్రం ఢిల్లీలో సమావేశం కానుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భేటీ కానున్న ఈ  కమిటీ నేడు మొదటి విడత జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. 
 

Congress CEC meeting to be held today Is there a possibility of releasing the list of Lok Sabha candidates?..ISR
Author
First Published Mar 7, 2024, 7:51 AM IST

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) దేశ రాజధానిలో సమావేశం కానుంది. ఇందులో లోక్ సభ అభ్యర్థులను పరిశీలించి, నిర్ణయించే అవకాశం ఉంది. ఈ సమావేశం గురువారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని  ఏఐసీసీ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు.

శెభాష్ రా బుడ్డోడా.. చిరుతను ఇంట్లో బంధించిన పిల్లాడు.. వీడియో వైరల్..

దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాల చెలరేగిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కాగా.. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గత వారం బీజేపీ విడుదల చేసింది. కానీ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి వీలుగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Russia War: ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి.. యుద్ధంలో మరణించిన హైదరాబాదీ

అమేథీ నుంచి రాహుల్ గాంధీ, గతంలో సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయడంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ రెండు స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పరిగణిస్తుండటంతో కాంగ్రెస్ మొదటి కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు అక్కడి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ స్థానిక యూనిట్లు డిమాండ్ చేస్తున్నాయి.

యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ, అదే రాష్ట్రంలోని రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ లోక్ సభకు పోటీ చేస్తారని ఆ పార్టీకి చెందిన నాయకులు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. 2004 నుంచి అమేథీ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కేరళలోని వయనాడ్ నుంచి గెలిచారు. అయితే రాయ్ బరేలి నుంచి ప్రియాంక తొలిసారి అరంగేట్రం చేయనున్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- బీజేపీల మధ్య పొత్తు : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టంగ్ స్లిప్.. వీడియో వైరల్

ఇదిలా ఉండగా.. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆయా స్క్రీనింగ్ కమిటీల సమావేశాలు నిర్వహించి తమ రాష్ట్రాల్లోని స్థానాలకు అభ్యర్థుల జాబితాను పంపించాయి. పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన గురువారం సమావేశం కానున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నేడు ఆ అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించనున్నాయి. వివాదాలు లేని స్థానాలను నేడు ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios