కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో బీజేపీ ముఖ్య నాయకులు, మంత్రులుగా ఉన్న ఐదుగురు వెనకబడిపోయారు. ఆయా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
కర్ణాటకలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. నేటి ఉదయం మొదలైన కౌంటింగ్ లో మొదటి నుంచి కాంగ్రెస్ ఆధికత్య కనబరుస్తోంది. బీజేపీ మెజారిటీ సాధించడానికి చాలా దూరంలోనే ఉంది. అయితే ఫలితాల్లో బీజేపీ ముఖ్య నాయకులైన ఐదుగురు మంత్రులు కూడా వెనకంజలో ఉన్నారు.
కర్ణాటక ఫలితాల ట్రెండ్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్.. ఢిల్లీ ఆఫీసులో ‘బజరంగ్ బలి’ నినాదాలు..
ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలైన సిద్ధరామయ్యతో పాటు మరి కొందరు ఆధిక్యత కనబరుస్తున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోకపై 15,098 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే వరుణ నియోజకవర్గంలో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య గృహనిర్మాణ శాఖ మంత్రి వి.సోమన్నపై 1,224 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ బీజేపీ ఆఫీసులో పాము కలకలం.. సీఎం ఉండగానే గందరగోళ పరిస్థితి.. (వీడియో)
కాగా.. చామరాజనగర్ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్న సోమన్న అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగ శెట్టిపై 9 వేల ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ కేసీ నారాయణ గౌడ రెండో రౌండ్ లో జేడీఎస్ అభ్యర్థి హెచ్ డీ మంజుపై 3,324 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Karnataka Election Results: హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పూజలు..
పీడబ్ల్యూడీ మంత్రి సీసీ పాటిల్ వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ యావగల్ 544 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హిరేకెరూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి యూబీ బనాకర్ కంటే వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వెనుకంజలో ఉన్నారు. చిక్కబళ్లాపూర్ అసెంబ్లీ స్థానంలో ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ 1,400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
వెనుకంజలో ఉన్న కర్ణాటక బీజేపీ అగ్రనేతలు వీరే..
వి సోమన్న,
డాక్టర్ కె.సి.నారాయణగౌడ్,
సి.సి.పాటిల్,
బి.సి. పాటిల్,
డాక్టర్ కె.సుధాకర్
