దేశ‌వ్యాప్తంగా కరోనా తగ్గుతున్నా...ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. క్ర‌మంగా కేసుల సంఖ్య  పెరుగుతోంది. చూస్తుండ‌గానే కేసుల సంఖ్య 600కు చేరవైంది. భారత్‌లో ఒక్కరోజులో 156 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.   దీంతో  ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య  578 కి చేరింది.  ఈ క్ర‌మంలో  శిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కర్ఫ్యూ సమయాల్లో సాయిబాబా ఆలయాన్ని మూసివేయనున్న‌ట్టు  సంస్థాన్ ట్రస్ట్ సీఈవో భాగ్యశ్రీ తెలిపారు.  

భార‌త్ లో కరోనా కేసులు తగ్గుతున్న.. ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. క్ర‌మంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. చూస్తుండ‌గానే కేసుల సంఖ్య 600 కు చేరవైంది. భారత్‌లో ఒక్కరోజులో 156 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 578 కి చేరింది. దేశంలో 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. ఈ మ‌హమ్మారి నుంచి ఇప్పటివరకు 151 మందికోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

ఇప్ప‌టివ‌ర‌కూ న‌మోదైన కేసుల్లో ఢిల్లీలో అత్య‌ధికంగా 142 కేసుల న‌మోద‌య్యాయి. ఆ త‌రువాత మహారాష్ట్ర లో 141 కేసులు నమోద‌య్యాయి. కేరళ లో 57, గుజరాత్ లో 49, రాజస్థాన్ లో 43 , తెలంగాణ లో 41, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలోనే మధ్య ప్ర‌దేశ్, హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ లో కేసులు న‌మోద‌య్యాయి. దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అల‌ర్ట్ అయ్యాయి. ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో ఆంక్షాలు విధించాయి. మ‌రో వైపు క‌రోనా కేసులు కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) దేశవ్యాప్తంగా 6,531 కేసులు న‌మోద‌య్యాయి.

Read Also : భార‌త్ లో Omicron పంజా.. హిమాచల్ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్ ల్లోకి ఎంట్రీ..!

ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతుండ‌టంతో మ‌హారాష్ట్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. కరోనా నిబంధనలను అమలు క‌ఠినంగా అమలు ప‌రుస్తోంది. ప‌లు ప్రధాన న‌గ‌రాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుక వ‌చ్చింది. అంతేకాదు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆంక్షలు పెట్టింది. వివాహ వేడుకల్లో కేవలం 100మందికి మాత్రమే అనుమతినిచ్చింది. ఇక 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్‌లకు అనుమతించింది. మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేసింది. క‌చ్చితంగా సోష‌ల్ డిస్టెంట్ పాటించాల‌ని హెచ్చ‌రింది. 

Read Also : టీకా తీసుకోమంటే.. కర్రతో దాడిచేసి.. పోలీస్ చెయ్యి విరగ్గొట్టాడు..

ఈ త‌రుణంలో షిర్డీ సాయిబాబా సంస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా అమలు అవుతోన్న‌ కర్ఫ్యూ ఆదేశాలకు అనుగుణంగా.. షిర్డీలోని ప్రసిద్ధ సాయిబాబా మందిరాన్ని రాత్రి వేళల్లో మూసివేయనున్నట్లు సంస్థాన్ ప్ర‌క‌టించింది. నైట్ కర్ఫ్యూ అమలు అవుతోన్న స‌మ‌యంలో ప్ర‌ధాన‌ ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు. ఆలయంలోని అన్ని సౌకర్యాలు కూడా మూసివేస్తామని భక్తులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ .