Asianet News TeluguAsianet News Telugu

టీకా తీసుకోమంటే.. కర్రతో దాడిచేసి.. పోలీస్ చెయ్యి విరగ్గొట్టాడు..

కరోనా టీకా తీసుకోవడానికి ససేమిరా అన్న ఓ వ్యక్తి... అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారితో గొడవపడి చెయ్యి విరగ్గొట్టాడు. ఝార్ఖండ్ లోని గిరిధ్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్కడి మహువర్ గ్రామ ప్రజలను టీకాలు తీసుకునేలా ప్రోత్సహించడానికి అధికారులు వచ్చారు. 

police officer who went for vaccination in Giridih, Jharkhand, was beaten up, broke his hand by hitting him with a rod
Author
Hyderabad, First Published Dec 27, 2021, 11:36 AM IST

ఝార్ఖండ్ : covid 19 మహహ్మారి ప్రపంచదేశాల్ని వణికిస్తోన్నా.. ఇంకా చాలామందిలో టీకా భయాలు పోలేదు. కరోనాతో పోరాడడానికి వ్యాక్సినేషనే సులువైన మార్గం అని ప్రపంచదేశాలన్నీ ప్రచారం చేస్తున్న ఇంకా కొంతమంది దీనిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సూది అంటూ భయమో, టీకా వేసుకుంటే ఏదైనా అవుతుందన్న ఆందోళనో.. vaccination అనగానే మొండికెత్తడం, పారిపోవడం, గొడవకు దిగడం, ఊరొదిలి వెళ్లిపోవడం లాంటి ఘటనలు అక్కడక్కడా దర్శనమిస్తూనే ఉన్నాయి.

అలాంటి ఓ ఘటనే Jharkhandలో చోటు చేసుకుంది. టీకా తీసుకోమని చెప్పినందుకు hand విరగ్గొట్టుకోవాల్సి వచ్చింది. టీకా వేసేవ్యక్తి, తీసుకోవాల్సిన వ్యక్తి మధ్యలో ఒప్పించడానికి వెళ్లిన వ్యక్తి నష్టపోయాడు. వివరాల్లోకి వెడితే.. 

కరోనా టీకా తీసుకోవడానికి ససేమిరా అన్న ఓ వ్యక్తి. అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారితో గొడవపడి చెయ్యి విరగ్గొట్టాడు. ఝార్ఖండ్ లోని గిరిధ్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్కడి మహువర్ గ్రామ ప్రజలను టీకాలు తీసుకునేలా ప్రోత్సహించడానికి అధికారులు వచ్చారు. 

వారితోపాటు పోలీస్ అధికారి కృష్ణ కుమార్ మరాండి కూడా ఉన్నారు. అయితే రామచంద్ర ఠాకూర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు టీకా తీసుకోమని చెప్పారు. వారికి వ్యాక్సిన్ ప్రయోజనాల గురించి చెప్పి ఒప్పించడానికి కృష్ణ కుమార్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన మీద ఆగ్రహానికి గురైన ఠాకుర్ కర్రతో దాడి చేయగా చెయ్యి విరిగింది. వెంటనే ఠాకుర్ అక్కడి నుంచి పారిపోయాడు. కృష్ణ కుమార్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఠాకుర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

భార‌త్ లో Omicron పంజా.. హిమాచల్ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్ ల్లోకి ఎంట్రీ..!

ఇదిలా ఉండగా, భార‌త్ లో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ త‌న పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా 70 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 535కు చేరింది. అలాగే ఆదివారం కొత్త‌గా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల న‌మోద‌యినా రాష్ట్రాల సంఖ్య 19 కి చేరింది. 

కాగా ఆదివారం.. కేర‌ళలో 19 కొత్త ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57 కి చేరింది. వీటిలో ఎర్నాకులంలో 11 కేసులు, తిరువనంతపురంలో 6 కేసులు, త్రిసూర్, కన్నూర్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే మ‌హారాష్ట్రలో ఆదివారం 31 ఓమిక్రాన్ కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. దీంతో ఈ వేరియంట్ సోకిన వారి సంఖ్య 141 కి చేరింది. వీటిలో ముంబైలో 27 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తొలిసారిగా 9 ఒమిక్రాన్ వేరియంట్‌ల కేసులు నమోదయ్యాయి. ఇండోర్‌లో ఎనిమిది కొత్త కేసులు గుర్తించామని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదివారం తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ‎ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు వెలుగులోకి వ‌చ్చింది. డిసెంబర్ 3న కెనడా నుంచి మ‌హిళకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ కాగా,  14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ త‌రువాత  డిసెంబర్ 18 న, బాధిత మ‌హిళ‌ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీలోని NCDCకి పంపారు. ఆ మహిళ ప్రస్తుతం ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుందని తెలిపారు. అయితే ఆమె ఇప్పటికే రెండు డోసులు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios