భార‌త్ లో Omicron పంజా.. హిమాచల్ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్ ల్లోకి ఎంట్రీ..!

భార‌త్ లో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ త‌న పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో  ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 535కు చేరింది. అలాగే ఆదివారం కొత్త‌గా హిమాచ‌ల్ ప్ర‌దేశ్, మధ్యప్రదేశ్లో లో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల న‌మోద‌యినా రాష్ట్రాల సంఖ్య 19 కి చేరింది. 
 

Omicron upadates in india 2 States Report First Omicron Cases

భార‌త్ లో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ త‌న పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా 70 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 535కు చేరింది. అలాగే ఆదివారం కొత్త‌గా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల న‌మోద‌యినా రాష్ట్రాల సంఖ్య 19 కి చేరింది. 

కాగా ఆదివారం.. కేర‌ళలో 19 కొత్త ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57 కి చేరింది. వీటిలో ఎర్నాకులంలో 11 కేసులు, తిరువనంతపురంలో 6 కేసులు, త్రిసూర్, కన్నూర్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే మ‌హారాష్ట్రలో ఆదివారం 31 ఓమిక్రాన్ కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. దీంతో ఈ వేరియంట్ సోకిన వారి సంఖ్య 141 కి చేరింది. వీటిలో ముంబైలో 27 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తొలిసారిగా 9 ఒమిక్రాన్ వేరియంట్‌ల కేసులు నమోదయ్యాయి. ఇండోర్‌లో ఎనిమిది కొత్త కేసులు గుర్తించామని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదివారం తెలిపారు.

Read Also: నేడే బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష.. ఎక్కడంటే...

హిమాచల్ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్లో  ఒమిక్రాన్ ఏంట్రీ..! 

హిమాచల్ ప్రదేశ్‌లో ‎ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు వెలుగులోకి వ‌చ్చింది. డిసెంబర్ 3న కెనడా నుంచి మ‌హిళకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ కాగా,  14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ త‌రువాత  డిసెంబర్ 18 న, బాధిత మ‌హిళ‌ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీలోని NCDCకి పంపారు. ఆ మహిళ ప్రస్తుతం ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుందని తెలిపారు. అయితే ఆమె ఇప్పటికే రెండు డోసులు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా క‌రోనా వేగంగా వ్యాపిస్తోంది. ఆదివారం మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6 కి చేరింది. వ్యాధి సోకిన వారిద్దరూ ఇతర దేశాల నుంచి వచ్చినవారే. హర్యానాలో ఒమిక్రాన్ మరొక కేసు కూడా వెలుగుచూసింది. దీని కారణంగా కొత్త వేరియంట్‌ సోకిన వారి సంఖ్య 10కి పెరిగింది. ఒడిసాలో కూడా ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. విదేశాల నుంచి ఒడిశాకు తిరిగి వచ్చిన నలుగురికి ఓమిక్రాన్ సోకింది. వీరిలో ఇద్దరు నైజీరియా నుంచి వచ్చారని, మిగిలిన ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8 కి చేరింది. ఒడిశాలో, డిసెంబర్ 21 న, నైజీరియా, ఖతార్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొత్త వేరియంట్‌ బారిన పడ్డారు. 

Read Also: ఛత్తీస్‌గడ్‌ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

మ‌రోవైపు తెలంగాణ లో కూడా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆదివారం మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య  44 కి చేరుకుంది. అదే సమయంలో, చండీగఢ్‌లో ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి మరో 2 కేసులు గుర్తించారు. ఇక్కడ మొత్తం 3 కేసులు నమోదయ్యాయి.

మ‌రో వైపు.. కరోనా వైర‌స్ కేసుల కూడా క్ర‌మంగా పెరుగుతోంది.  దేశ‌వ్యాప్తంగా ఆదివారం ఒక్క‌రోజే.. 6,987 కొత్త కరోనావైరస్ న‌మోదయ్యాయి. అదే స‌మ‌యంలో 162 మరణాలు సంభ‌వించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 76,766కి, మరణాల సంఖ్య 4,79,682కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 76,766కి తగ్గిందని, ఇది మొత్తం ఇన్ఫెక్షన్ కేసులలో 0.22 శాతం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

 దీంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న Omicron వేరియంట్ దృష్టిలో పెట్టుకుని..  జనవరి 10 నుండి దేశ‌వ్యాప్తంగా.. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రిక‌ష‌న్ డోస్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.  అదే త‌రుణంలో  15 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు వేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని ప్రకటించారు. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా అప్ర‌మ‌త్త‌మైంది. డిసెంబర్ 27 నుండి రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. ఢిల్లీ బాట‌లోనే.. మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios