యోగా తరగతుల ముసుగులో ఉగ్రవాద శిబిరాలు నిర్వహించిన పీఎఫ్ఐ - ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి..
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) యోగి శిక్షణా తరగతుల ముసుగులో సభ్యులకు ఉగ్రవాద శిక్షణను ఇచ్చేందని ఎన్ఐఏ తెలిపింది. అందులో ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా నేర్పించేవారని పేర్కొంది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) తీవ్రవాద శిక్షణా శిబిరాలను నిర్వహించి, ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు వ్యక్తులను నియమించుకుందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టుకు ఛార్జిషీట్ అందించింది. అందులో షాకింగ్ విషయాలను వెల్లడించిందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
బాత్రూం గ్రిల్స్ తొలగించి.. రూ.47 లక్షల విలువైన నగలు చోరీ...భర్తతో కలిసి ఇంటి పనిమనిషి దారుణం..
ఎన్ఐఏ ఛార్జిషీట్ ప్రకారం.. భారత ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు, వ్యక్తుల పట్ల కోపం, విషంతో నిండిన ప్రసంగాలను రాడికలైజ్ చేయడానికి, బ్రెయిన్‌వాష్ చేయడానికి అమాయక ముస్లిం యువకులను పీఎఫ్ఐలోకి ఆకర్షిస్తున్నారని దర్యాప్తులో తేలింది. పీఎఫ్ఐలో చేరిన తర్వాత యువకులను శిక్షణా శిబిరాలకు పంపించేవారు. అక్కడ వారికి కత్తులు, కొడవళ్లు, ఇనుప రాడ్‌లను అందజేసేవారు. వాటితో గొంతు, కడుపు, తల వంటి శరీర భాగాలపై దాడి చేయడంతో పాటు ఉగ్రవాద చర్యలకు ఎలా పాల్పడాలో నేర్పించేవారు. అయితే వీటిని యోగా శిక్షణా శిబిరాలు అని ముసుగులో కొనసాగేవి.
తెలంగాణలో ఈ వ్యవహారంపై తొలిసారిగా కేసు నమోదైన ఆరు నెలల తర్వాత శుక్రవారం 11 మందిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తెలంగాణ పోలీసులు ఈ ఏడాది మొదట్లో జులై 4న నిజామాబాద్ జిల్లాలో కేసు నమోదు చేశారు. పీఎఫ్‌ఐకి వ్యతిరేకంగా ఆగస్టు 26న ఎన్‌ఐఏ తిరిగి కేసు నమోదు చేసింది.
కమ్యూనిటీ నాయకులు, ప్రజలను అనుసరించడానికి పీఎఫ్ఐ అనేక రాష్ట్రాలు, జిల్లాల్లో హిట్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. విద్యావంతులను చేర్చుకోవడం కూడా కొనసాగించింది. పీఎఫ్ఐ మార్షల్ ఆర్ట్స్, హిట్ స్క్వాడ్ మెంబర్, ట్రైనర్ అయిన మహ్మద్ ముబారక్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఆయన కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
కాగా.. గురువారం కేరళలో పీఎఫ్ఐకు సంబంధించిన 58 స్థలాలపై ఎన్ఐఏ దాడి చేసింది. అనేక ముఖ్యమైన నేరారోపణ పత్రాలు, మెటీరియల్‌తో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. కొంత మంది పీఎఫ్ఐ నాయకులు పీఎఫ్ఐ పేరు మార్చి సంస్థను తిరిగి స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ సమాచారం అందడంతోనే దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు.
కుక్క స్వైరవిహారం.. 2 గంటల్లో 40 మందిని కరిచింది.. పేషెంట్లతో హాస్పిటల్ వార్డు ఫుల్
కేంద్రం ఇటీవల ఐదేళ్లపాటు పీఎఫ్‌ఐ సంస్థపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ సంస్థపై ఎన్ఐఏ చర్యలు కొనసాగిస్తోంది. సెప్టెంబరులో ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర ఏజెన్సీలు అలాగే పోలీసు బలగాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక దాడులలో 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.