Asianet News TeluguAsianet News Telugu

కుక్క స్వైరవిహారం.. 2 గంటల్లో 40 మందిని కరిచింది.. పేషెంట్లతో హాస్పిటల్ వార్డు ఫుల్

రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లాలో ఓ కుక్క స్వైరవిహారం చేసింది. రెండు గంటల వ్యవధిలోనే 40 మందిని కరిచింది. వీరంతా సమీప హాస్పిటల్ చేరడంతో ఆ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు ఫుల్ అయింది.
 

dog bites 40 people within 2 hours in rajasthan
Author
First Published Dec 30, 2022, 12:51 PM IST

జైపూర్: ఓ వీధి కుక్క స్వైరవిహారం చేసింది. కనిపించిన వారిని కరుచుకుంటూ వెళ్లింది. రెండు గంటలపాటు ఆ ఏరియాలో కుక్కతో ప్రజలు భీతిల్లిపోయారు. రెండు గంటల్లోనే 40 మందిని కరిచేసింది. వారు ఒకరి తర్వాత ఒకరు సమీప హాస్పిటల్‌కు చేరారు. హాస్పిటల్‌లోనూ కుక్క కాటుకు గురైన పేషెంట్లతో ఎమర్జెన్సీ వార్డు నిండిపోయింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లా కళ్యాణ్‌పూర్ ఏరియాలో జరిగింది.

పెద్ద మొత్తంలో తక్కువ కాల అవధిలో కుక్క కాటుతో పేషెంట్లు హాస్పిటల్ చేరడంపై ఆ ఆస్పత్రి యాజమాన్యం ఆందోళన చెందింది.వెంటనే ఈ విషయాన్ని సిటీ కౌన్సిల్‌కు తెలియజేసింది. దీంతో సిటీ కౌన్సిల్ ఆ కుక్కను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేసింది. హాస్పిటల్ సిబ్బందితో వారు ఎట్టకేలకు ఆ కుక్కను పట్టుకోగలిగారు.

నగరంలోని వేర్వేరు చోట్లలోని వీధి కుక్కలను పట్టుకోవడానికి సిటీ కౌన్సిల్ ప్లాన్‌ చేస్తున్నది.

Also Read: కిరాణా షాప్ కు వెళ్లివ‌స్తుండ‌గా వీధికుక్క‌ల దాడి.. ఐదేండ్ల బాలిక మృతి

హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈ పేషెంట్ల గురించి మాట్లాడారు. ఒక్కసారిగా కుక్క ఎవరి కనిపిస్తే వారిని కరవడంం మొదలు పెట్టినట్టు తెలిసిందన్నారు. ఈ కుక్క కాటుకు గురైన చాలా మంది తమ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని చెప్పారు.

నోయిడా సిటీలోని లోటస్ బౌలేవార్డ్ వద్ద అక్టోబర్ నెలలో ఓ పసికందుపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ పాపకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ పాప చనిపోయింది. దీంతో ఆ సిటీలో విహరిస్తున్న వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపాలని నిరసనలు కూడా వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios