Asianet News TeluguAsianet News Telugu

తల్లి అంత్యక్రియలనంతరం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని.. విశ్రాంతి తీసుకోవాలని సూచించిన మమతా బెనర్జీ

ఓ వైపు తల్లి చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా ప్రధాని నరేంద్ర మోడీ తన బాధ్యతలను మరువలేదు. ఓ కుమారుడిగా తల్లికి సంప్రదాయబద్ధంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసిన వెంటనే షెడ్యూల్ ప్రకారం అధికారికి కార్యక్రమాల్లో వర్చువల్ గా పాల్గొన్నారు. దీంతో ఈ కష్ట సమయంలో కొంత విశ్రాంతి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. 

Prime Minister Mamata Banerjee, who participated in official functions after her mother's last rites, advised her to rest
Author
First Published Dec 30, 2022, 1:34 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు. నేటి ఉదయం సమయంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. తల్లి పాడెను మోశారు. సంప్రదాయబద్ధంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తరువాత ప్రధాని మోడీ తన అధికారిక పనుల్లో మునిగిపోయారు. హౌరా - న్యూ జల్‌ ను కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

కుక్క స్వైరవిహారం.. 2 గంటల్లో 40 మందిని కరిచింది.. పేషెంట్లతో హాస్పిటల్ వార్డు ఫుల్

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానితో మాట్లాడుతూ.. కొంచెం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ‘‘ మీ అమ్మ మా అమ్మ’’ అని సంబోధించారు. ‘‘ దయచేసి కొంచెం విశ్రాంతి తీసుకోండి. మీ తల్లి మరణానికి ఎలా సంతాపం చెప్పాలో నాకు తెలియడం లేదు. మీ అమ్మ మా అమ్మ. నేను నా తల్లిని గుర్తుంచుకున్నాను’’ ఆమె ప్రధాని మోడీతో అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించనున్న ఐదు రైల్వే ప్రాజెక్టుల్లో నాలుగింటి పనులు తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభించినట్లు మమతా బెనర్జీ చెప్పారు. 

వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ వరుస ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఆ రాష్ట్రాన్ని శుక్రవారం సందర్శించాల్సి ఉంది. కానీ తల్లి మరణంతో ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్ నకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా ఆయన పర్యటను రద్దు చేసుకున్నా.. ఆ కార్యక్రమాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

తన ప్రేమకు అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కూతురు.. మహరాష్ట్రలో ఘటన

కాగా.. పశ్చిమ బెంగాల్ లో రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రత్యేక్షంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బీజేపీ సీనియర్ నాయుడు సుభాష్ సర్కార్ హాజరయ్యారు. అయితే ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో మమతా బెనర్జీ వేధికపైకి వెళ్లడానికి నిరాకరించారు. రైల్వే మంత్రి వేదిక పైకి రావాలని ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు. దీంతో ఆమె వేధిక పక్కనే నిలబడి ప్రసంగించారు.

‘జై శ్రీరాం’ అనలేదని 10 ఏళ్ల ముస్లిం బాలుడిని చితకబాదిన గిరిజనుడు.. మధ్యప్రదేశ్ లో ఘటన

ముందుగా ప్రధానమంత్రి తల్లి మరణానికి ఆమె సంతాపం తెలిపారు. ఇలాంటి కష్టసమయంలో కూడా అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నందుకు మమతా బెనర్జీ ధన్యవాదాలు చెప్పారు. ‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి.. ఈ రోజు విచారకరమైన రోజు.. దేవుడు మీకు శక్తిని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని అన్నారు. ‘‘ మీరు ఈ రోజు పశ్చిమ బెంగాల్‌కు రావాల్సి ఉన్నా మీ తల్లి మరణం వల్ల రాలేకపోయారు. అయినా వర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని చేరుకున్నారు. ధన్యవాదాలు. మీరు దహన సంస్కారాల పూర్తి చేసి వచ్చారు. కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. ’’ అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios