మహారాష్ట్రలో ఒమిక్రాన్ కారణంగా తొలిసారిగా ఒకరు మరణించారని వచ్చిన వార్త కలకలం రేపుతున్నది. ఇదే తరహాలో రాజస్తాన్‌లోనూ మరొకరు మరణించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, అధికారులు ఈ వార్తలను ఖండించారు. రాజస్తాన్‌లో 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తర్వాత మరణించినట్టు అధికారులు తెలిపారు.  

జైపూర్: ఆ వ్యక్తి రెండు డోసుల టీకాలు(Vaccines) వేసుకున్నాడు. అయినా.. కరోనా వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) బారిన పడ్డాడు. వారం రోజులు ఆ వైరస్‌తో పోరాడి రికవరీ(Recovery) అయ్యాడు. కానీ, ఆ తర్వాత ఆయనకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులకు కరోనా అనంతరం న్యూమోనియా తోడవ్వడంతో కన్నుమూశాడు. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. కాగా, కొందరు దీన్ని ఒమిక్రాన్ మరణంగా(Death) భావిస్తున్నారు. మహారాష్ట్రలో తొలి ఒమిక్రాన్ మరణం చోటుచేసుకున్నట్టు కొందరు చెబుతున్నారు. అయితే, వైద్యాధికారులు మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

నర్సింగ్ స్టాఫ్‌గా పని చేసి రిటైర్ అయిన 73 ఏళ్ల వ్యక్తి రెండు డోసులూ వేసుకున్నాడు. కానీ, అనారోగ్యంతో ఈ నెల 15న ఉదయ్‌పూర్‌లోని ఎంబీజీహెచ్ హాస్పిటల్‌లో చేరాడు. అప్పుడే ఆయనకు కరోనా టెస్టు చేయగా.. పాజిటివ్ అని తేలింది. అప్పుడు ఆయనకు శ్వాసకోశ సంబంధ సమస్యలు, న్యూమోనియా తరహా సమస్య కూడా ఉన్నది. డిసెంబర్ 21వ తేదీ వరకు చికిత్స అందించారు. అదే రోజు ఆయనకు కరోనా నెగెటివ్‌ రిపోర్ట్ వచ్చింది. 24వ తేదీన ఆయన మరణించారు. ఆయనకు కరోనా పాజిటివ్ రాగానే శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కూ పంపారు. ఆయన మరణించిన తర్వాతి రోజు అంటే ఈ నెల 25వ తేదీన జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించిందని ఎంబీజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ఎల్ సుమన్ వివరించారు.

Also Read: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం?.. కానీ అధికారులు మాత్రం ఏం చెబుతున్నారంటే..

అంతేకాదు, ఈ నెల 25వ తేదీన కూడా ఆయనకు కరోనా టెస్టు చేశారు. అందులో కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆ డాక్టర్ తెలిపారు. ఆ వ్యక్తి రెండు డోసులు తీసుకున్నాడని, బహుశా ఆయనకు కరోనా సోకడం ఇదే తొలిసారి అని వివరించారు. ఆయనకు కరోనా నెగెటివ్ రాగానే.. ఆయనను జనరల్ వార్డుకు పంపినట్టు తెలిపారు. కొవిడ్ అనంతరం న్యూమోనియా, హైపర్‌టెన్షన్, హైపర్ థైరాయిడిజ్ సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగానే ఆయన మరణించినట్టు కనిపిస్తున్నదని ఉదయ్‌పూర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దినేశ్ ఖరాది తెలిపారు.

భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం (omicron death) సంభవించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం అది ఒమిక్రాన్ వల్ల చోటుచేసుకన్న మరణం కాదని.. యాదృచ్చికంగా జరిగిందని పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో (Maharashtra) ఇటీవల గుండెపోటుతో మరణించిన 52 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ గుర్తించబడింది. మరణించిన వ్యక్తికి నైజీరియా (Nigeria) ట్రావెల్ హిస్టరీ కూడా కలిగి ఉండటంతో దానిని ఒమిక్రాన్ మరణంగానే భావిస్తున్నారు. అయితే అతడి మరణానికి కోవిడ్ (covid) కారణం కాదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే అతని శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌‌గా తేలిందని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఒక బులిటెన్ విడుదల చేశారు. 

Also Read: Omicron Cases In India: భారత్‌లో 1,270కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఒక్కరోజే 16వేలకు పైగా కరోనా కేసులు..

‘నైజీరియా ట్రావెల్ హిస్టరీ కలిగిన 52 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 28న పుణె సమీపంలోని పింప్రి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని యశ్వంతరావు చవాన్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు. ఈ వ్యక్తికి గత 13 సంవత్సరాలుగా మధుమేహం ఉంది. ఈ రోగి మరణం కోవిడ్ కాని కారణాల వల్ల, యాదృచ్ఛికంగా జరిగింది. అయితే NIV ఇచ్చిన నివేదిక అతనికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు వెల్లడిస్తోంది’ అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.