మహారాష్ట్రలో (Maharashtra) ఇటీవల గుండెపోటుతో మరణించిన 52 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ గుర్తించబడింది. మరణించిన వ్యక్తికి నైజీరియా (Nigeria) ట్రావెల్ హిస్టరీ కూడా కలిగి ఉండటంతో దానిని ఒమిక్రాన్ మరణంగానే భావిస్తున్నారు. అయితే అతడి మరణానికి కోవిడ్ (covid) కారణం కాదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం (omicron death) సంభవించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం అది ఒమిక్రాన్ వల్ల చోటుచేసుకన్న మరణం కాదని.. యాదృచ్చికంగా జరిగిందని పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో (Maharashtra) ఇటీవల గుండెపోటుతో మరణించిన 52 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ గుర్తించబడింది. మరణించిన వ్యక్తికి నైజీరియా (Nigeria) ట్రావెల్ హిస్టరీ కూడా కలిగి ఉండటంతో దానిని ఒమిక్రాన్ మరణంగానే భావిస్తున్నారు. అయితే అతడి మరణానికి కోవిడ్ (covid) కారణం కాదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే అతని శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌‌గా తేలిందని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఒక బులిటెన్ విడుదల చేశారు. 

‘నైజీరియా ట్రావెల్ హిస్టరీ కలిగిన 52 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 28న పుణె సమీపంలోని పింప్రి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని యశ్వంతరావు చవాన్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు. ఈ వ్యక్తికి గత 13 సంవత్సరాలుగా మధుమేహం ఉంది. ఈ రోగి మరణం కోవిడ్ కాని కారణాల వల్ల, యాదృచ్ఛికంగా జరిగింది. అయితే NIV ఇచ్చిన నివేదిక అతనికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు వెల్లడిస్తోంది’ అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఇక, మహారాష్ట్రలో గురువారం కొత్తగా 5,368 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 22 మంది మరణించారు. మరోవైపు గురువారం మహారాష్ట్రలో 198 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది. కొత్తగా నమోదైన 198 ఒమిక్రాన్ కేసుల్లో.. 30 మంది అంతర్జాతీయ ప్రయాణికులు. తాజాగా కేసుల్లో ముంబైలో 190, థానేలో 4, సతారా, నాందెడ్‌, పుణె, పింప్రి చించ్‌వాడ్‌లో ఒక్కటి చొప్పున నివేదించబడ్డాయి. 

Also read: Omicron Cases In India: భారత్‌లో 1,270కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఒక్కరోజే 16వేలకు పైగా కరోనా కేసులు..

ఇక, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని కోరింది. క్లోజ్డ్ స్పేస్‌లు 50శాతం సీటింగ్ కెపాసిటీతో, ఓపెన్ స్పేస్‌లు 25శాతం కెపాసిటీతో ఈవెంట్‌లను నిర్వహించుకొవచ్చని తెలిపింది.