Asianet News TeluguAsianet News Telugu

21వ శ‌తాబ్దపు భార‌త అభివృద్ధిలో సైన్స్ దే కీల‌క పాత్ర - ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ..

21వ శ‌తాబ్దపు భార‌త అభివృద్ధిలో సైన్స్ రంగానికి కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ ప్రభుత్వం సైన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

Science plays a key role in the development of India in the 21st century - Prime Minister Narendra Modi..
Author
First Published Sep 10, 2022, 1:16 PM IST

పరిష్కారం, పరిణామం, ఆవిష్కరణలకు సైన్స్ ప్రాతిపదిక అని, అందుకే ‘న్యూ ఇండియా’ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే మంత్రంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సెంటర్-స్టేట్ సైన్స్ కాన్‌క్లేవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం పాల్గొన్న ప్రధాని మోడీ గుజరాత్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. ‘ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుబంధ్’ మంత్రంతో దేశం ముందుకు సాగుతోందన్నారు.

యువ‌త‌లో 42 శాతం నిరుద్యోగులు.. దేశ‌ భవిష్యత్తు భద్రమేనా? : కేంద్రం పై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

21వ శ‌తాబ్దపు భార‌త‌దేశ అభివృద్ధిలో సైన్స్ ది ముఖ్యపాత్ర అని అన్నారు. అన్ని రంగాలు వృద్ధిని వేగవంతం చేయడంలో సైన్స్ కీలక పాత్ర అని చెప్పారు.  పరిష్కారం, పరిణామం, ఆవిష్కరణలకు సైన్స్ ఆధారమని ఆయన తెలిపారు. ఈ స్ఫూర్తితోనే నేటి నవ భారతం, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞానంతో పాటు జై అనుసంధాన్ అంటూ ముందుకు సాగుతోందని అన్నారు.

విజ్ఞానం పరిచయం అయినప్పుడు ప్రపంచంలోని అన్ని కష్టాల నుండి మనకు విముక్తి మార్గం ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయ‌ని అన్నారు. నేడు భార‌త్ నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వ‌హిస్తోంద‌ని తెలిపారు. ఇందులో భార‌త దేశ సైన్స్ రంగానికి చెందిన వ్య‌క్తుల పాత్ర చాలా ఉంద‌ని అన్నారు. పాశ్చాత్య దేశాలలో ఐన్‌స్టీన్, ఫెర్మీ, మాక్స్ ప్లాంక్, నీల్స్ బోర్, టెస్లా వంటి శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యప‌రిచార‌ని అన్నారు. అదే సమయంలో సివి రామన్, జగదీష్ చంద్రబోస్, సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాద్ సాహా, ఎస్ చంద్రశేఖర్ వంటి అనేక మంది శాస్త్రవేత్తలు తమ కొత్త ఆవిష్కరణలను తెరపైకి తెచ్చార‌ని కొనియాడారు.

దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్.. ఆ బాధ్య‌త‌ల నుండి తొలగింపు

గత శతాబ్దపు తొలి దశాబ్దాలను గుర్తు చేసుకుంటే ప్రపంచం వినాశనం, విషాదంలో ఎలా సాగిందో మ‌నం తెలుసుకోవచ్చునని ప్రధాని మోడీ తెలిపారు. కానీ ఆ కాలంలో కూడా ప్రతిచోటా శాస్త్రవేత్తలు తమ గొప్ప ఆవిష్కరణలో నిమగ్నమై ఉన్నార‌ని అన్నారు. 

ఈ అమృత కాలంలో పరిశోధన, ఆవిష్కరణల్లో భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు అనేక రంగాల్లో ఒకే స‌మ‌యంలో కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాల‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం సైన్స్ ఆధారిత అభివృద్ధి దృక్పథంతో పని చేస్తోంద‌ని చెప్పారు. 2014 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయ‌ని అన్నారు. ప్రభుత్వ కృషి కారణంగా 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ నేడు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 46వ స్థానంలో ఉంద‌ని అన్నారు. 

శాస్త్రవేత్తల విజయాలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ప్ర‌ధాని కోరారు. “ మన శాస్త్రవేత్తల విజయాన్ని మనం జ‌రుపుకుంటే సైన్స్ మన సమాజం, సంస్కృతిలో భాగమవుతుంది. మన శాస్త్రవేత్తల విజయాలను జరుపుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఇవి అంద‌రికీ స్పూర్తినిస్తాయి” అని ప్రధాని అన్నారు. 

హిమంత బిస్వా ఓల్డ్ ట్వీట్ వైరల్.. ఎవరిని మోసం చేస్తున్నాడంటూ కాంగ్రెస్ ఫైర్

సెప్టెంబర్ 10-11 తేదీల్లో అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో రెండు రోజుల కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మొదటి కాన్‌క్లేవ్ దేశవ్యాప్తంగా బలమైన సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ (STI) పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి, సహకార సమాఖ్య స్ఫూర్తితో  కేంద్ర రాష్ట్ర సమన్వయం,  సహకార యంత్రాంగాలను బలోపేతం చేస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios