Asianet News TeluguAsianet News Telugu

హిమంత బిస్వా ఓల్డ్ ట్వీట్ వైరల్..  ఎవరిని మోసం చేస్తున్నాడంటూ కాంగ్రెస్ ఫైర్ 

బీజేపీ నాయ‌కుడు, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పాత ట్వీట్‌పై దుమారం రేగింది. 2010లో  కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న‌ప్పుడూ ఆయ‌న చేసిన ట్వీట్‌ని స్క్రీన్ షాట్ వేసి.. ఓ కాంగ్రెస్ నాయ‌కుడు ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. బిశ్వ‌శ‌ర్మ  చేసిన పాత ట్విట్ లో రాహుల్ గాంధీ దేశానికి ఏన్నాటికైనా ప్రధాని అవుతారని పేర్కొన‌డంతో ఈ ట్విట్ వైరల్ అవుతోంది. 
 

Himanta Biswa 2010 tweet goes viral Cong leader says, Who is he cheating?
Author
First Published Sep 10, 2022, 12:11 PM IST

కాంగ్రెస్ 'భారత్ జోడో' యాత్రపై బీజేపీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తోంది. ఆ పార్టీ అగ్రనేతలంతా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ..ట్వీట్ల‌తో దాడి చేశారు. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా రాహుల్‌పై విరుచుకుపడ్డారు. సెటైరిక‌ల్ వీడియోను పోస్టు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోకు ప్ర‌తిస్పంద‌న‌గా.. ఓ కాంగ్రెస్ నాయకుడు మ‌రో ట్విట్ చేశారు. ఆ  కాంగ్రెస్ నాయ‌కుడు... హిమంత బిస్వా శర్మ 2010లో చేసిన ట్వీట్ ను స్కీన్ షాట్ చేసి షేర్ చేశారు. ఇప్పుడూ ఈ పోస్టు తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ పోస్టులో ఏముంది. ఎందుకు అంత వైరల్ గా మారిందనేది తెలుసుకుందాం... 
 
తమిళనాడులోని విరుదునగర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తన హ్యాండిల్‌తో హిమంత బిస్వాశ‌ర్మ 2010 లో చేసిన‌ ట్వీట్ ను స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ..  'డియర్ నరేంద్ర మోడీ జీ, హిమంత బిస్వా ఎవరిని మోసం చేస్తున్నారు? అతని పాత రికార్డు ఇదే చూపిస్తోంది...' ఇది కాకుండా.. హిమంతకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అతని గురించి జాగ్రత్త వహించండి. మీరు అతన్ని మోసం చేయడానికి అనుమతించరని నాకు తెలుసు. అయినా ఆయ‌న‌కు దూరంగా ఉండండి.’ అని రాశాడు. ప్ర‌స్తుతం అస్సాం సీఎం చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇంత‌కీ హిమంత్ బిస్వాశ‌ర్మ  2010లో చేసిన ట్వీట్‌లో ఏమ‌ని పేర్కొన్నారంటే..   "రాహుల్ గాంధీ సరైన సమయంలో మన దేశానికి ప్రధాని అవుతారు. అప్పుడు మా AASU అతనిని కొత్త ఢిల్లీలో కలవడానికి అతని అపాయింట్‌మెంట్ కోరుతుంది. అని పేర్కోన్నారు. 

 
2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
 
హిమంత బిస్వా 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీతో తన రాజ‌కీయ ప్రయాణం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడానికి ప్ర‌ధాన‌ కారణం రాహుల్ గాంధేన‌నీ హిమంత బిస్వా చెప్పారు. రాహుల్ గాంధీని క‌లువ‌డానికి వెళ్లిన‌ప్ప‌డు త‌నని ప‌ట్టించుకోకుండా.. అత‌డు తన కుక్కతో ఆడుకునే వాడ‌నీ,  తన కుక్క బిస్కెట్లు తింటుంటే అదే ప్లేట్ నుండి బిస్కెట్లు ఇచ్చాడని రాహుల్‌పై ఆరోపించారు. 2016లో అస్సాంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ త‌రువాత‌ అస్సాం సీఎంగా ఎన్నిక‌య్యారు.

హిమంత బిస్వా నిరంతరం రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఉంటారు. 2016, 2019లో సర్జికల్‌ స్ట్రైక్స్‌, వైమానిక దాడులపై రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వం నుంచి సాక్ష్యాధారాలు కోరినప్పుడు.. తాను రాజీవ్‌గాంధీ కుమారుడని రాహుల్‌ గాంధీ నుంచి బీజేపీ ఎప్పుడైనా రుజువు కోరిందని హిమంత అన్నారు. జోడో ఇండియా యాత్ర, రాహుల్ గాంధీ ఈ యాత్రను పాకిస్తాన్‌కు తీసుకెళ్లాలని చెప్పబడింది. భారత్ ఇప్పటికే ఐక్యంగా ఉందన్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను భారత్‌లో విలీనం చేసేందుకు రాహుల్‌గాంధీ ప్రయత్నించాలని, తద్వారా అఖండ భారత్‌ ఏర్పడుతుందని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios