Asianet News TeluguAsianet News Telugu

యువ‌త‌లో 42 శాతం నిరుద్యోగులు.. దేశ‌ భవిష్యత్తు భద్రమేనా? : కేంద్రం పై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

భార‌త్ జోడో యాత్ర‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ఎత్తిచూపుతూ రాహుల్ గాంధీ దేశ‌వ్యాప్త "భార‌త్ జోడో యాత్ర‌"ను ప్రారంభించారు. ఈ మెగా ర్యాలీ 150 రోజుల పాటు.. క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. 
 

42 per cent of the youth are unemployed. Is the future of the country secure? : Rahul Gandhi's criticism of centre
Author
First Published Sep 10, 2022, 1:08 PM IST

భార‌త్ జోడో యాత్ర‌:  భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశానికి చేసిన నష్టాన్ని పూడ్చడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టిందని  ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న‌ద‌ని పేర్కొన్న ఆయ‌న.. దేశ భ‌విష్య‌త్తు భ‌ద్రంగానే ఉందా? అని ప్ర‌శ్నించారు. 

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌లు, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను నిర‌శిస్తూ.. దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ గ‌త వైభ‌వాన్ని తీసుకురావ‌డానికి రాహుల్ గాంధీ దేశవ్యాప్త భార‌త్ జోడో యాత్ర‌ను చేప‌ట్టారు. లౌకిక‌త‌త్వాన్ని పెంపొందించ‌డం, బీజేపీ విభ‌జ‌న రాజ‌కీయాల‌ను ఎండ‌క‌డుతూ దేశాన్ని ఏకం చేయ‌డానికి త‌మ యాత్ర కొన‌సాతుంద‌నీ, ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాటం సాగిస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని రాహుల్ అన్నారు. భార‌త్ జోడో యాత్ర నేప‌థ్యంలో మ‌రోసారి కేంద్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన రాహుల్ గాంధీ.. ఒక ట్వీట్‌లో ఆయ‌న ఒక ఫోటోను పంచుకున్నారు.. మ‌న‌ యువతలో 42% నిరుద్యోగులు ఉన్నార‌ని పేర్కొన్నారు. భార‌త్ భవిష్యత్తు భద్రమేనా? అంటూ ప్ర‌శ్నించారు. ఆలాంటి నిరుద్యోగుల కోసం.. ప్ర‌జ‌ల కోసం, ఉద్యోగాల కోసం తాము ముందుండి పోరాటానికి న‌డుస్తామ‌ని తెలిపారు. వారికి అండగా ఉంటామని స్ఫష్టం చేశారు. 

అంత‌కుముందు రాహుల్ గాంధీ త‌మిళ‌నాడులో మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం  దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు అని అన్నారు. "భారతదేశంలో ఇప్పుడు లేనిది తనకంటూ ఒక దార్శనికత. అందుకే భారతదేశం గతం నుండి ఒక దార్శనికతను కనుగొనడానికి గతంలోకి వెళ్ళవలసి వచ్చింది. గతం నుండి ఏదీ భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించదు" అంటూ బీజేపీ సర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. "భారతదేశం ఇప్పుడు మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలనే దృక్పథం దివాలా తీయడాన్ని ఎదుర్కొంటోంది. మేము భారీ గుత్తాధిపత్యాల ఆలోచనకు వ్యతిరేకం. మేము అన్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాము.. రైతులకు లేదా MSMEలకు వ్యతిరేకంగా స‌ర్కారు కొన‌సాగుతోంది. కొంత‌మందికి ప్ర‌యోజ‌నం చేకూరే విధంగా పాల‌న సాగిస్తోంది.. ఏదేమైనప్ప‌టికీ న్యాయమే గెలుస్తుంది’’ అని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. 

కాగా, కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌.. రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో కన్యాకుమ‌రి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. 3,570 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. అట్టడుగు ప్ర‌జా సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ యాత్ర దాదాపు 150 రోజులు కొన‌సాగ‌నుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios