సత్యం కోసం గళం విప్పినందుకే సంజయ్ సింగ్ సస్పెన్షన్ - ఆమ్ ఆద్మీ పార్టీ
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, సంజయ్ సింగ్ సస్పెండ్ అయ్యారు. దీనిపై ఆయన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్యం మాట్లాడినందుకే తనపై వేటు వేశారని ఆరోపించారు.

నిజాలు మాట్లాడినందుకు రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేశారని ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపించింది. మణిపూర్ అల్లర్లపై చర్చ సందర్భంగా ఆందోళన చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిని రాజ్యసభ నుంచి చైర్మన్ సప్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ.. తమ ఆ పార్టీ సభ్యుడు సస్పెన్షన్ కు గురైనందుకు బాధపడటం లేదని అన్నారు.
ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఏబీవీపీ మాజీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మదన్ దాస్ దేవి ఇక లేరు..
‘‘సత్యం కోసం గళం విప్పినందుకు సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేశారు. కానీ నేను బాధపడబోను. మా లీగల్ టీం ఈ విషయాన్ని పరిశీలిస్తుంది, కానీ ఇది దురదృష్టకరం’’ అని ఆయన తెలిపారు. కాగా.. సభాపతి ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు సంజయ్ సింగ్ ను పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. సంజయ్ సింగ్ సస్పెన్షన్ తీర్మానాన్ని కేంద్ర మంత్రి, సభా నాయకుడు పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు.
మణిపూర్ అంశంపై సభలో విపక్షాల నిరసన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ఆప్ డిమాండ్ చేసింది. మణిపూర్ పరిస్థితిపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా ఆప్ ఆద్మీ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కోరారు. అయినా వారు వినిపించుకోకపోవడంతో సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేశారు.
ఇక వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు.. వచ్చే ఏడాది అందుబాటులోకి..
ఈ వర్షాకాల సమావేశాల్లో మిగిలిన కాలానికి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. కాగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమయ్యాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి.