ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఏబీవీపీ మాజీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మదన్ దాస్ దేవి ఇక లేరు..
ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఏబీవీపీ మాజీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మదన్ దాస్ దేవి చనిపోయారు. వృధాప్య సంబంధింత అనారోగ్యంతో కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేటి ఉదయం కన్నుమూశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ నేత మదన్ దాస్ దేవి సోమవారం ఉదయం కన్నుమూశారు. మహారాష్ట్రకు చెందిన 81 ఏళ్ల హిందుత్వ సిద్ధాంతకర్త.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన బెంగళూరులోని రాష్టోత్తన్ హాస్పిటల్ చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం మరణిచారని ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు.
ఇక వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు.. వచ్చే ఏడాది అందుబాటులోకి..
ఆయన మృతదేహాన్ని మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్ఎస్ఎస్ స్థానిక ప్రధాన కార్యాలయం కేశవ కృపాలో ఉంచి అంత్యక్రియల కోసం పుణెకు తరలిస్తామని ఆయన చెప్పారు. కాగా.. మదన్ దాస్ దేవి బీజేపీ, ఆరెస్సెస్ అగ్రనేతల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పూర్తికాల ప్రచారక్ (ప్రచారకర్త) అయిన దేవి వృద్ధాప్య సంబంధిత వ్యాధి చికిత్స కోసం బెంగళూరులో ఉంటున్నారు.
టమాటాలు తినడం మానేస్తే ధరలు తగ్గుతాయి - యూపీ మంత్రి ప్రతిభా శుక్లా వింత సలహా
దేవి ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా, ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ మదన్ దాస్ దేవి తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేశారు. ఆయనతో సన్నిహితంగా మెలగడమే కాకుండా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం నాకు లభించింది. ఈ విషాద సమయంలో కార్యకర్తలకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.
కాగా.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ శ్రీ మదన్ దాస్ దేవి ఉదయం 5 గంటలకు బెంగళూరులోని రాష్ట్రోత్తన్ ఆసుపత్రిలో కన్నుమూశారని ఆర్ఎస్ఎస్ తన సందేశంలో పేర్కొంది. ఆయన వయసు 81 సంవత్సరాలు. అఖిల భారత విద్యార్థి పరిషత్ మంత్రిగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కో సర్కారియావాహ్ గా బాధ్యతలు నిర్వర్తించారని పేర్కొంది.