Asianet News TeluguAsianet News Telugu

పూణెలో రోడ్డు ప్ర‌మాదం.. భక్తులతో వెళ్తున్న ట్రక్ బోల్తా పడి 13 మందికి గాయాలు

భక్తులను తీసుకెళ్తున్న ఓ ట్రక్ మహారాష్ట్రలోని పూణెలో బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

Road accident in Pune. Truck carrying devotees overturned, 13 injured
Author
First Published Oct 7, 2022, 2:51 PM IST

పూణె జిల్లాలోని అలండి ఆలయానికి గురువారం భక్తులతో వెళ్తున్న ట్ర‌క్ బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 13 మందికి గాయాలు అయ్యాయి. వారంతా ప్ర‌స్తుతం హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన దాదాపు 24 మంది భ‌క్తులు భక్తులు పూణె నగరానికి సమీపంలోని జెజురిలోని ఒక ఆలయంలో ప్రార్థనలు చేసి ట్రక్కులో వస్తున్నారు.

రావణ దహనం: బాడీ బూడిదైంది.. పది తలలు చెక్కు చెదరలేదు.. అధికారులపై యాక్షన్

అయితే ఆ ట్ర‌క్కు అలంది వైపు వెళుతుండగా షింద్‌వానే ఘాట్‌లో ఒక్క సారిగా ఆ వాహ‌నం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అయితే డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తమై ట్రక్కును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ టైర్లు స్లిప్ అయ్యి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 13 మంది భక్తులు గాయాలు అయ్యాయి, 

ఈ ఘ‌ట‌న‌పై కల్భోర్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. ట్ర‌క్కులో ప్ర‌యాణిస్తున్న ప‌లువురు భ‌క్తుల‌కు స్ప‌ల్ప గాయాలు అయ్యాయ‌ని తెలిపారు.  వారిని సమీపంలోని హాస్పిట‌ల్ కు త‌ర‌లించామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వారంద‌రూ అక్క‌డ చికిత్స పొందుతున్నార‌ని పేర్కొన్నారు. 

ఘోరం.. పెళ్లికి నిరాక‌రించ‌ద‌ని యువ‌తికి నిప్పంటించిన వివాహితుడు.. ఎక్క‌డంటే ?

కాగా.. ఇదే రాష్ట్రంలోని ముంబ‌యిలో కూడా గురువారం ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ముంబ‌యిలోని బాంద్రా-వర్లీ సముద్ర లింక్‌పై వేగంగా వెళ్తున్న ఆగివున్న మూడు వాహ‌నాలు, అక్క‌డి జ‌నాల‌పైకి దూసుకెళ్లింది. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌తో పాటు ఇతర వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచి, అంతకుముందు ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ స్కామ్.. మూడు రాష్ఠ్రాల్లో ఈడీ దాడులు.. కేంద్రంపై మండిప‌డ్డ కేజ్రీవాల్

గాయపడిన వారిని బాంద్రాలో వర్లీ లేన్‌కు తీసుకెళ్లేందుకు వైద్య బృందం సిద్ధమవుతుండగా, ఒక హైస్పీడ్ కారు వేగంగా వ‌చ్చి వాహనాలను ఢీకొట్టింది, ఫలితంగా ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్ర‌మాద దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన CCTV ఫుటేజీలో.. ఒక అంబులెన్స్, మూడు కార్లు వంతెనపై నిలబడి ఉండగా, అధిక వేగంతో వచ్చిన వాహనం వాటిని ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో పలువురు ఘటనా స్థలంలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios