Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. పెళ్లికి నిరాక‌రించ‌ద‌ని యువ‌తికి నిప్పంటించిన వివాహితుడు.. ఎక్క‌డంటే ?

పెళ్లి ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందని ఆగ్రహించిన ఆ యువకుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

Horrible.. The married man who set the young woman on fire for refusing to marry.. Where is he?
Author
First Published Oct 7, 2022, 2:00 PM IST

పెళ్లి ప్ర‌తిపాద‌న‌ను నిరాక‌రించింద‌ని ఓ యువ‌తిపై ఓ యువ‌కుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగులోకి వ‌చ్చింది. పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి చేసిన యువ‌కుడికి ఇది వ‌ర‌కే పెళ్లి కూడా అయ్యింది. బాధిత యువ‌తికి అత‌డు మూడేళ్లుగా ప‌రిచ‌యం.

సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీల ప్యానెల్‌లో భిన్నాభిప్రాయాలు!.. సీజేఐకి ఓ లేఖ

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..  జార్ఖండ్ రాష్ట్రం జర్ముండి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాల్కి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువ‌తి స్థానికంగా ఉండే రాజేష్ రౌత్ కు 2019 సంవ‌త్స‌రంలో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. కొంత కాలం కింద‌ట అత‌డు ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని భావించాడు. కానీ ఆ యువ‌తి, ఆమె కుటుంబ స‌భ్యులు దీనికి అంగీక‌రించ‌లేదు. దీంతో రాజేష్ వేరే యువ‌తిని అత‌డు ఈ ఏడాది ఫిబ్ర‌వరిలో వివాహం చేసుకున్నాడు. 

అయిన‌ప్ప‌టికీ అత‌డు మ‌ళ్లీ బాధిత‌ యువ‌తిని రెండో వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విష‌యం యువ‌తికి చెప్పాడు. కానీ ఆమె దానికి నిరాక‌రించింది. దీంతో త‌న‌ను పెళ్లి చేసుకోక‌పోతే గ‌తంలో అంకిత కు ప‌ట్టిన గతే ప‌డుతుంద‌ని మంగ‌ళ‌వారం హెచ్చ‌రించాడు. అయినా ఆమె అత‌డి మాట విన‌లేదు. 

ముంబయి లోకల్ ట్రైన్‌లో సీటు కోసం శివాలెత్తిన మహిళలు.. జుట్లు పట్టుకుని వాదులాట (వీడియో)

ఈ క్ర‌మంలో గ‌త గురువారం రాత్రి బాధితురాలు త‌న అమ్మ‌మ్మ‌తో క‌లిసి నిద్ర‌పోతున్న స‌మ‌యంలో ఇంట్లోకి చొర‌బ‌డ్డారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాలిక క‌ళ్లు తెరిచి చూసే స‌రికి రాజేష్ పారిపోతూ క‌నిపించాడు. ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె అమ్మ‌మ్మ కు కూడా స్ప‌ల్ప గాయాలు అయ్యాయి. దీంతో బాలిక‌ను కుటుంబ స‌భ్యులు, స్థానికులు క‌లిసి ఆమెను దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే మెరుగైన చికిత్స కోసం అక్క‌డి నుంచి ఆమెను రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు రిఫర్ చేశారు. ప్ర‌స్తుతం బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మహారాష్ట్ర, గుజరాత్ లలో రూ. 120 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్: ఆరుగురు అరెస్ట్

ఆగష్టు 23వ తేదీన ఇదే రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ట‌నే ఒకటి చోటు చేసుకుంది. దుమ్కా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో నివాసం ఉండే 16 ఏళ్ల బాలిక అంకిత నిద్రిస్తున్న స‌మ‌యంలో సమీపంలో ఉండే షారుక్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది. అనంత‌రం అత‌డిని పోలీసులు అరెస్టు చేశారు. 

అయితే నిందితుడు షారుఖ్ ని పోలీసు వాహనంలోకి తీసుకువెళుతున్నప్పుడు అత‌డి ముఖంలో ఎలాంటి విచారం, ప‌శ్చాతాపం లేకుండా నవ్వుతూ కనిపించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. కాగా.. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న కొన్ని వారాల్లోనే తాజా ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం విచార‌క‌రం. 

Follow Us:
Download App:
  • android
  • ios