Asianet News TeluguAsianet News Telugu

రావణ దహనం: బాడీ బూడిదైంది.. పది తలలు చెక్కు చెదరలేదు.. అధికారులపై యాక్షన్

ఛత్తీస్‌గడ్‌లో దసరా సందర్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో రావణుడి బొమ్మ మొత్తం కాలిపోయింది. కానీ, ఆయన పది తలలు మాత్రం చెక్కుచెదరకుండా ఉండిపోయాయి. దీంతో అధికారులపై యాక్షన్ తీసుకున్నారు.

ravan ten heads did not burn, chattisgarch muncipality take actions on officials
Author
First Published Oct 7, 2022, 2:42 PM IST

రాయ్‌గడ్: దసరా సందర్భంగా ఛత్తీస్‌గడ్‌లో రావణుడి బొమ్మను తగులబెట్టారు. కానీ, ఆ బొమ్మ దేహం మొత్తం కాలిపోయింది. కానీ, ఆ పది తలలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయాయి. దీంతో అధికారులు ఆగ్రహించారు. సిబ్బంది నిర్లక్ష్యమే అని మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. తమ మున్సిపాలిటీకి చెడ్డ పేరు వస్తున్నదని నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు పంపారు. ఒక ఉద్యోగి పై సస్పెన్షన్ వేటు వేశారు.

ఛత్తీస్‌గడ్ ధంతారి మున్సిపాలిటీ అధికారులు దసరా రోజున రామ్‌లీలా మైదానంలో రావణుడి బొమ్మను ఏర్పాటు చేశారు. దుర్గా పూజా చివరి రోజున ఈ బొమ్మను దహనం చేశారు. అయితే, ఆ రావణుడి బొమ్మ పది తలలు మినహా మొత్తం కాలిపోయింది. ఆ పది తలలు మాత్రం అలాగే చెక్కు చెదరకుండా ఉండిపోయాయి. దీంతో దంతారి మున్సిపల్ కార్పొరేషన్ క్లర్క్ రాజేంద్ర యాదవ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. రావణుడి బొమ్మ తయారు చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆయనపై ఈ వేటు వేశారు.

అంతేకదు, అసిస్టెంట్ గ్రేడ్ 3 అయిన రాజేంద్ర యాదవ్ రావణుడి బొమ్మ తయారీలో నిర్లక్ష్యం వహించారని, ఫలితగా డీఎంసీ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆదేశ పత్రం వివరించింది. మరో ఉద్యోగి సమర్థ్ రనసింగ్‌కు ఆయన బాధ్యతలు ఇచ్చినట్టు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేశ్ పదంవార్ తెలిపారు.

అసిస్టెంట్ ఇంజినీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజినీర్లు లొమస్ దేవాంగన్, కమలేశ్ ఠాకూర్ కమట నాగేంద్రలకు షోకాజ్ నోటీసులు పంపారు.

రావణుడి బొమ్మ తయారీ బాధ్యతలు అప్పగించిన వారిపై యాక్షన్ తీసుకున్నామని, ఇప్పుడు ఆ బొమ్మ తయారు చేసిన వారికీ డబ్బులు ఇవ్వకుండా నిలిపేశామని వివరించారు.

బొమ్మ మొత్తం కాలి బూడిదైనా.. తలలు మాత్రం చెక్కు చెదరకపోవడానికి వాటిని సరిగా తయారు  చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios