Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ స్కామ్.. మూడు రాష్ఠ్రాల్లో ఈడీ దాడులు.. కేంద్రంపై మండిప‌డ్డ కేజ్రీవాల్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈడీ శుక్రవారం మళ్లీ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ హైదరాబాద్ లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 

Delhi Excise Policy Scam.. ED raids in three states.. Kejriwal slams Center
Author
First Published Oct 7, 2022, 12:48 PM IST

ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ స్కామ్ ద‌ర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు మొద‌లు పెట్టింది. ఢిల్లీ, పంజాబ్‌లోని దాదాపు 35 చోట్ల ఈ దాడులు కొన‌సాగుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల కూడా సోదాలు జ‌రుగుతున్నాయ‌ని అధికారులు తెలిపారు. 

ఈ స్కామ్ లో ప్ర‌మేయం ఉంద‌ని భావిస్తున్న నిందితుల‌ను విచారించిన స‌మ‌యంలో కొన్ని కొత్త లీడ్ ల‌ను ఈడీ పొందిందని, దీంతో మ‌ద్యం కొంతమంది మద్యం పంపిణీదారులు, కంపెనీలు, అనుబంధ సంస్థలపై ఏజెన్సీ సోదాలు నిర్వ‌హిస్తోంద‌ని వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అరుణ్ బాలి క‌న్నుమూత‌

ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు 103 కంటే ఎక్కువ దాడులు నిర్వహించింది. ఈ కేసులోనే గత నెలలో మద్యం వ్యాపారి, తయారీ కంపెనీ ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహంద్రును కూడా అరెస్టు చేసింది. కాగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ లెఫ్ట‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ సీబీఐ విచారణకు సిఫారసు చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వ‌చ్చింది. 

ఈ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖ‌లు చేసింది. ఈ వ్యవహారంలో 11 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, మంత్రి సత్యేందర్ జైన్‌లను ఈడీ ప్ర‌శ్నించిది. అలాగే సీబీఐ కూడా పలువురిని ప్రశ్నించి వ్యాపారవేత్త విజయ్ నాయర్‌ను అరెస్టు చేసింది.

మహారాష్ట్ర, గుజరాత్ లలో రూ. 120 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్: ఆరుగురు అరెస్ట్

కాగా.. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి జరుగుతున్న తాజా దాడుల‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. త‌మ డ‌ర్టీ రాజ‌కీయాల కోసం ఇంత మంది అధికారుల స‌మ‌యాన్ని వృథా చేస్తున్నార‌ని ప‌రోక్షంగా ఆయ‌న కేంద్రంపై మండిప‌డ్డారు. 

‘‘ 500కు పైగా దాడులు. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సంపాదించ‌డానికి 3 నెలల నుండి 300 మందికి పైగా సీబీఐ, ఈడీ అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారు. కానీ ఏమీ దొర‌కలేదు. ఎందుకంటే ఆయ‌న ఏమీ చేయ‌లేదు. కాబ‌ట్టి చాలా అధికారుల సమయం వారి మురికి రాజకీయాల కోసం వృథా అవుతోంది. ఇలా చేస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ’’ అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios