Amit Shah: కరోనా మళ్లీ విజృంభిస్తోంది.. నిర్లక్ష్యం వహిస్తే.. మహమ్మారి నియంత్రణ కష్టమే..!
Amit Shah:దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రజలు అలసత్వం వహిస్తూ.. నిబంధనలు పాటించకుంటే కొవిడ్ మహమ్మారిని నియంత్రించలేమని అన్నారు. అందరూ తప్పకుండా కరోనా మార్గదర్శకాలు పాటించాలనీ, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
Amit Shah: చాలా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. పలు దేశాల్లో ఈ వేరియంట్ కారణంగా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. భారత్ లోనూ ఈ వేరియంట్ కేసులు నిత్యం వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రజలు అలసత్వం వహిస్తూ.. నిబంధనలు పాటించకుంటే కొవిడ్ మహమ్మారిని నియంత్రించలేమని అన్నారు. అందరూ తప్పకుండా కరోనా మార్గదర్శకాలు పాటించాలనీ, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా మహమ్మారి తన రూపు మార్చుకుంటూ తీవ్రంగా విజృంభిస్తున్నదని పేర్కొంటూ.. ఇతర దేశాల పరిస్థితులను ప్రస్తావించారు. ఒమిక్రాన్, ఇతర వేరియంట్ల మరోసారి విజృంభిస్తున్నందున జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారు స్థానికంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Omicron: ఆ మూడు గంటలు మద్యం అమ్మకాలు ఆపండి... హైకోర్టు ఆదేశాలు
కరోనా టీకాలు తీసుకోవాని వారు ఉంటే వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు. ఇక కరోనా వేరియంట్ల విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం 15 నుంచి 18 ఏండ్ల వారికి సైతం కరోనా టీకాలు వేయడానికి నిర్ణయంచింది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించిన అమిత్ షా.. జనవరి 3 నుంచి పిల్లలకు టీకా ప్రారంభమవుతున్నందున 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులందరూ కరోనా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ రూపు మార్చుకున్న తర్వాత మరోసారి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మునిసిపల్ కార్పొరేషన్లు, జిల్లా పంచాయతీ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి స్థానిక అంశాలను పరిశీలిస్తూ.. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కరోనా మహమ్మారి పరిస్థితులపై వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోన్న కేంద్ర ప్రభుత్వం.. స్థానిక అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే కొవిడ్ నిబంధలను పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మహమ్మారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు.
Also Read: పోలవరం పనులపై కేంద్ర జల్ శక్తి శాఖ కమిటీ సంతృప్తి.. నేడు కుడికాలువ పనుల పరిశీలన
మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొండంలో అందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలని పేర్కొన్న అమిత్ షా.. టీకాలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండరాదని తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. గడువు ముగిసినా రెండోడోసు తీసుకోని వారందరూ వెంటనే టీకాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది కాబట్టి కరోనా మర్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలనీ, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అమిత్ షా ప్రజలను కోరారు. ఇదిలావుండగా, దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కొత్త వేరియంట్ కేసులు వేయికి చేరువయ్యాయి. అధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కి పెరిగింది.
Also Read: Omicron: మహారాష్ట్రలో ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో ఎన్నంటే?