భారత్, చైనా సరిహద్దులో శాంతి నెలకొంటే తప్ప.. ఆ దేశంలో సంబంధాలు మామూలుగా ఉండవని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఈ విషయాన్ని భారత్ చైనాకు తేల్చి చెప్పిందని అన్నారు.
బార్డర్ లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో భారత్ సంబంధాలు మామూలుగా ఉండవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈ విషయంలో ఆ దేశానికి భారత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని గురువారం అన్నారు. గురువారం ఆయన ‘హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్’లో పాల్గొని మాట్లాడారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం నెలకొంటుందని, ఒప్పందాలు పాటిస్తే తప్ప, యథాతథ స్థితిని మార్చే ఏకపక్ష ప్రయత్నాలను ఆపలేమని అన్నారు.
అమ్మను పడేసిన బాతుబొమ్మ... దెయ్యం ప్రాంక్ వీడియో వైరల్..
2020 గాల్వాన్ వ్యాలీలో జరిగిన వాగ్వివాదాలను ప్రస్తావిస్తూ.. ‘‘ అది ఓ పార్టీ చేసిన ప్రయత్నం, ఒప్పందాలు, అవగాహనల నుంచి వైదొలగాలని మాకు తెలుసు. ’’అని అన్నారు. వాటిలో కొన్నింటిని పరిష్కరించామని, ఇంకా కొన్నింటిని పరిష్కరించాల్సి ఉందని మంత్రి చెప్పారు. ‘‘ అప్పటి నుండి మనం పురోగతి సాధించామా? కొన్ని అంశాలలో అవుననే చెప్పాలి. సాపేక్షంగా చెప్పాలంటే బహుళ ఘర్షణ పాయింట్లు ఉన్నాయి. ఆ ఘర్షణ పాయింట్లలో మిలిటరీ ద్వారా ప్రమాదకరమైన క్లోజ్ అప్ డిప్లాయ్‌మెంట్‌లు ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని పనిచేశాయని నేను భావిస్తున్నాను ’’ అని జై శంకర్ అన్నారు.
ఓరి నాయనో.. దేశీ మద్యం తాగిన ఏనుగుల గుంపు.. మత్తులో గంటల తరబడి నిద్రలోనే.. చివరికి ఏం జరిగిందంటే ?
కానీ కొన్నింటిపై ఇంకా పని చేయాల్సి ఉందని తాను భావిస్తున్నానని జైశంకర్ అన్నారు. ఇంకా మనం పట్టుదలతో ముందుకు సాగడం ముఖ్యమని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా అనుకూలంగా లేవని చైనా గ్రహిస్తుందని విదేశాంగ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చైనాకు భారత్ ఇచ్చిన సంకేతం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ‘‘ ఇది ప్రజల సెంటిమెంట్ మాత్రమే కాదు. ప్రజల సెంటిమెంట్ బలంగా ఉంది. ఇది ప్రభుత్వ విధానం. ఇది జాతీయ ఆలోచన. ప్రజల సెంటిమెంట్, వ్యూహాత్మక అంచనా అని నేను భావిస్తున్నాను.’’ అని అన్నారు.
కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సీతారామన్ స్పెషల్ సెల్ఫీ.. వివాదం..
కాగా.. 2020 జూన్ లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత భారతదేశం, చైనా మధ్య సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడింది. తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, దేప్సాంగ్ ప్రాంతాలలో ప్రతిష్టంభనను పరిష్కరించడంలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. అయినప్పటికీ సైనిక, దౌత్యపరమైన చర్చల ద్వారా ఇరుపక్షాలు వివాదాల ప్రాంతాల నుండి దళాలను ఉపసంహరించుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి శాంతి కీలకమని భారతదేశం స్థిరంగా ఉంది. తూర్పు లడఖ్‌లో మే 5, 2020న పాంగోంగ్ లేక్ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల తర్వాత సరిహద్దు ప్రతిష్టంభన మొదలైంది.
