Asianet News TeluguAsianet News Telugu

అమ్మను పడేసిన బాతుబొమ్మ... దెయ్యం ప్రాంక్ వీడియో వైరల్..

చిలిపి దెయ్యం ప్రాంక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది మీరూ చూసేయండి..

Ghost Prank Video On Mother Goes Viral on Internet
Author
First Published Nov 11, 2022, 10:40 AM IST

మీరు దెయ్యాలకు భయపడతారా? మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నారని మీకు అనిపిస్తుందా? మీకే కాదు చాలామందికి ఇలా అనిపించడం మామూలే.. అయితే, దీన్నే ఓ చిలిపి వీడియో చేశారు కొందరు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో అక్టోబర్ 25న షేర్ చేశారు. ఓ చిన్న క్లిప్‌లో తల్లి సోఫాలో కూర్చుని టేబుల్‌పై ఉంచిన ల్యాప్‌టాప్‌పై పని చేసుకుంటుండగా ఓ బాతుబొమ్మతో జరిగిన ఫన్నీ ఎన్కౌంటర్ ఇది.  

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది.. ఎలా.. వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. దీంతో ఆ ఫొటోకానీ, వీడియో కానీ క్షణాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చిన్న క్లిప్ 12.4 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. అంతేకాదు ఈ వీడియో ఎనిమిది లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. ఈ వీడియోను "అమ్మపై హాంటెడ్ డక్ ప్రాంక్" అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. చాలామంది వినియోగదారులు రకరకాల కామెంట్స్ తో ఈ ఫన్నీ వీడియోపై కామెంట్స్ చేశారు. 

అసలు ఈ వీడియోలో ఏముందంటే.. ఓ పెద్దావిడ సోఫాలో కూర్చుని ఉంది. ఆమెకు ఓ బాతు బొమ్మ కనిపించింది. అది మెల్లిగా కదులుతుంది. దీంతో ఆమె ముందు ఆశ్చర్యపోయి.. ఆ తరువాత దాన్ని ఎవరైనా కదుపుతున్నారేమో అనుకుని.. దాని వెనక ఎవరున్నారా.. అన్నట్టుగా లోపలికి తొంగి చూస్తుంది. ఎవ్వరూ కనిపించరు. ఆ సమయంలో బొమ్మ కాసేపు ఆగుతుంది. ఆ తరువాత మళ్లీ మెల్లిగా కదులుతుంది.

తను అనుమానిస్తున్నానా? లేక బొమ్మ నిజంగా కదులుతుందా.. అన్నట్టుగా ఆమె తన కళ్లద్దాలు తీసి.. మరోసారి పెట్టుకుని మరీ చూస్తుంది. కానీ దానివెనకున్న ఆంతర్యం ఆమెకు అర్థం కాదు. అంతేకాదు ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న సంభాషణ కూడా వినిపిస్తుంది. దీంతో ఆమె బొమ్మను తదేకంగా చూస్తుండగానే.. అప్పటివరకు నెమ్మదిగా ఊగిన బొమ్మ ఒక్కసారిగా ఆమె దగ్గరికి దూసుకువస్తుంది. దీంతో షాక్ అయిన ఆమె సోఫా మీదినుంచి కిందికి పడిపోతుంది. 

దీనిమీద చాలామంది ఫన్నీగా రియాక్ట్ అవ్వగా.. కొంతమంది మాత్రం ‘పెద్దలతో ఇలాంటి గేమ్స్ ఆడతారా?’ అని కోపానికి వస్తున్నారు. ‘ఇది తమాషాగా చేసినా.. ఆమెకు గుండెపోటు లాంటిదేమైనా వస్తే బాధ్యులు ఎవరు’ అంటూ కామెంట్ చేశారు. ‘వేరేవాళ్లను భయపెట్టడంతో ఏం కామెడీ ఉంటుందో నాకర్థం కాదు’ అని మరొకరు కామెంట్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios