Asianet News TeluguAsianet News Telugu

ఓరి నాయనో.. దేశీ మద్యం తాగిన ఏనుగుల గుంపు.. మత్తులో గంటల తరబడి నిద్రలోనే.. చివరికి ఏం జరిగిందంటే ?

సంప్రదాయ మద్యం తయారు చేసేందుకు కుండలో పులియబెట్టిన పువ్వుల నీటిని ఏనుగులు తాగి గుర్రుగా నిద్రపోయాయి. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 

A group of elephants who drank desi liquor.. Drunk and slept for hours.. What happened in the end?
Author
First Published Nov 11, 2022, 10:10 AM IST

మద్యం తాగిన వ్యక్తి రోడ్డు పక్కన పడుకోవడం, హంగామా చేయడం మనం తరచుగా గమనిస్తూ ఉంటాం. తాగిన సమయంలో వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేము. ఆ సమయంలో విచక్షణ కోల్పొతారు. ఆలోచన శక్తి మందగిస్తుంది. మరుసటి రోజు వాటి గురించి అడిగితే.. తమకేమీ గుర్తు లేదని, తమకేమీ తెలియదని దబాయిస్తారు. ఇలాంటివి మనుషులకే కాదు జంతువులకు కూడా జరుగుతాయని తాజా ఘటన నిరూపించింది. 

జమ్మూ కాశ్మీర్ షోపియాన్‌లో ఎన్ కౌంటర్.. జైషే ఉగ్రవాది హతం..

ఓ ఏనుగుల గుంపు దేశీయ మద్యం తాగి గుర్రుగా నిద్రపోయాయి. మత్తులో గంటల తరబడి నిద్రించాయి. ఈ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వాటిని నిద్రలేపడానికి అష్టకష్టాలు పడ్డారు. ఒడిశా రాష్ట్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని శిలిపాడ గ్రామస్తులు సాంప్రదాయ దేశీయ మద్యం చేయడానికి అడవిలో పెద్ద కుండల్లో మహువా పువ్వులను నానబెట్టారు. అవి బాగా పులిసిన తరువాత మద్యం తయారు చేయాలని అనుకున్నారు. 

తన పెళ్లికాకుండా మంత్రగత్తెలా అడ్డుపడుతోందని.. తల్లిని చంపిన తనయుడు

మరుసటి రోజు అడవిలోకి వెళ్లి చూశారు. కానీ అప్పటికే ఆ కుండలన్నీ పగిలిపోయి ఉన్నాయి. పక్కన చూస్తే ఓ 24 ఏనుగులు గాఢంగా నిద్రపోతూ ఉన్నాయి. వాటిని చూసి వారంతా ఖంగుతిన్నారు. ఆ కుండల్లోని మత్తెక్కింత్తెక్కించే పువ్వులతో ఉన్న నీటిని తాగినట్టు గుర్తించారు. అయితే ఆ ఏనుగులను నిద్రలేపడానికి గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మత్తులో నిద్రపోతున్న ఏనుగులును లేపడం వారి వల్ల కాలేదు. దీంతో ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. 

గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది అటవీ ప్రాంతంలోకి చేరుకున్నారు. ఏనుగుల గుంపును లేపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీని కోసం వారు పెద్ద పెద్ద డ్రమ్స్ వాయించారు. ఎన్నో గంటల ప్రయత్నాలు తరువాత ఎట్టకేలకు గజరాజులు నిద్ర నుంచి లేచాయి. చివరికి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.

కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సీతారామన్ స్పెషల్ సెల్ఫీ.. వివాదం..

ఈ ఘటనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఘాసిరామ్ పాత్ర మాట్లాడుతూ.. ప్రాసెస్ చేయని మద్యం తాగిన ఏనుగులు మత్తులోకి జారుకున్నాయని చెప్పారు. గంటల తరబడి అవి అలా నిద్రపోయే ఉన్నాయని తెలిపారు. గ్రామస్తులు తమకు సమాచారం అందించడంతో అటవీ ప్రాంతంలోకి చేరుకున్నామని చెప్పారు. వాటిని నిద్రలో నుంచి లేపడానికి భారీ శబ్దం చేయాల్సి వచ్చిందని, దాని కోసం డ్రమ్స్ ను ఉపయోగించామని పేర్కొన్నారు. ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios