Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సీతారామన్ స్పెషల్ సెల్ఫీ.. వివాదం..

హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ మధ్య సెల్ఫీ వివాదం రేగింది.  ప్రియాంకా గాందీ కోసం వచ్చిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో నిర్మలా సీతారామన్ సెల్ఫీ దిగారు. 

Congress Women's Wing Workers Take Selfies With Nirmala Sitharaman goes controversy in Himachal pradesh
Author
First Published Nov 11, 2022, 10:05 AM IST

షిమ్లా : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ సెల్ఫీ దిగారు. అదీ తన కాన్వాయ్ ఆపి మరీ దిగారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం (నవంబర్ 10)తో ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆఖరి రోజు కీలక నేతల ప్రచారంతో ఆ రాష్ట్రంలో హడావుడి నెలకొంది. ఈ క్రమంలో.. షిమ్లాలో నిర్వహించిన రోడ్ షోలో బీజేపీ నేత నిర్మలా సీతారామన్ ఉల్లాసంగా పాల్గొన్నారు. అయితే, కార్యక్రమం కోసం వెడుతున్న సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆమెకు తారసడ్డారు. అప్పటికే వాళ్లంతా ప్రియాంకగాంధీ వాద్రా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 

ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను చూసి చేతులు, తమ మెడలోని కండువాలు ఊపారట. అది గమనించిన సీతారామన్ కాన్వాయ్ ను ఆపించి, వాళ్ల దగ్గరికి వెళ్లారు.  వాళ్లతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి.. వాళ్ల కోరిక మేరకు వారితో సెల్ఫీలు కూడా దిగారు. ఈ విషయాన్ని బీజేపీ మీడియా ఇన్ ఛార్జ్ కరణ్ నందా తెలియజేశాడు. ఆ కాసేపటికే మాల్ రోడ్ లో మధ్యాహ్నం నిర్వహించిన జన్ సంపర్క్ ప్రచారంలో ప్రియాంక గాంధీ కార్యక్రమానికి ఆ కార్యకర్తలు హాజరయ్యారు.

జమ్మూ కాశ్మీర్ షోపియాన్‌లో ఎన్ కౌంటర్.. జైషే ఉగ్రవాది హతం..

ఇదిలా ఉంటే.. సీతారామన్ తో సెల్ఫీలు దిగడం మీద కాంగ్రెస్ గరం  గరంగా ఉంది. అలా చేయడం మీద కార్యకర్తలను షిమ్లా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ వివరణ కోరారు. సీతారామన్ మహిళలను తలెత్తుకునేలా చేశారని, అందుకే ఆమెతో సెల్ఫీలు దిగామని ఆ కార్యకర్తల ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్యపై పార్టీ పరమైన చర్యలుంటాయా? అనే దానిమీద స్పష్టత రావాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios