Asianet News TeluguAsianet News Telugu

2024లో బీజేపీని ఓడించడంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర - సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్

కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేదని అలాంటి చోట్ల బీజేపీతో ప్రాంతీయ పార్టీలే పోరాడుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. 

Regional parties will play a key role in defeating BJP in 2024 - Samajwadi Party chief Akhilesh Yadav ISR
Author
First Published Mar 19, 2023, 12:29 PM IST

రానున్న రోజుల్లో విపక్ష కూటమి రూపుదిద్దుకుంటుందని సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో లేదని, కానీ బీజేపీతో క్షేత్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలే పోరాడుతున్నాయని తెలిపారు. 

పంజాబ్ లో హై అలర్ట్‌..! కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. అమృతపాల్ సింగ్ అరెస్ట్ !

‘‘ప్రతిపక్ష కూటమి లేదా ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష కూటమి రూపుదిద్దుకుంటుందని నాకు నమ్మకం ఉంది. అది బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది’’ అని ఆయన వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీలను ఒకే పీఠంపైకి తెస్తున్నారా అన్న ప్రశ్నకు ఎస్పీ చీఫ్ సమాధానమిస్తూ వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలే కాషాయ శిబిరంపై పోరాడుతున్నాయని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఉనికిలో లేదని, కానీ ప్రాంతీయ పార్టీలు క్షేత్రస్థాయిలో కాషాయ శిబిరానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని, అవి విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏషియానెట్ న్యూస్‌కు భారీ విజయం: వార్త రిపోర్టింగ్ చేసినందుకు జర్నలిస్టులను జైలులో పెట్టలేమన్న కోర్టు..

జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను ప్రతిపక్ష కూటమిలో చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయని, తాము ఇప్పటికే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఇది పెద్ద పోరాటమని, ఈ పోరాటంలో తమ పాత్రను కాంగ్రెస్ పార్టీయే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష శిబిరానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఆ విషయం ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని, ఇది ప్రస్తుతానికి సరైన ప్రశ్న కాదని చెప్పారు. 2014, 2019లో బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. 

కాంగ్రెస్ కు కంచుకోటలుగా భావించే యూపీలోని రాయ్ బరేలీ, అమేథీ లోక్ సభ స్థానాల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా అని ప్రశ్నించగా.. అమేథీలో ఎస్పీ కార్యకర్తలను చంపేస్తున్నారని ఆరోపించారు. ‘‘అమేథీలో మా కార్యకర్తలను చంపేస్తున్నారు. తమ కోసం ఎవరు పోరాడుతారని సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అక్కడి సమాజ్ వాదీ కార్యకర్తలే ఒకరికొకరు మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమకు మద్దతుగా ముందుకు రావడం లేదు ’’ అని అన్నారు. 

మధ్యప్రదేశ్ లో విషాదం.. చంబల్ నదిలో మునిగి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ జోరును అడ్డుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ అన్ని విధాలా ప్రయత్నిస్తుందని చెప్పారు. ‘‘2024లో బీజేపీ అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. యూపీతో పాటు దేశంలోనూ బీజేపీని ఓడించేలా చూస్తాం. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న మిత్రపక్షాలతో కలిసి పోరాడతాం’’ అని అన్నారు.  అదానీ వ్యవహారంపై ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ దేశ ఆస్తులు, ప్రజాధనాన్ని దోచుకోవడానికి కేంద్రం అనుమతించిందని ఆరోపించారు. నెంబర్ టూ (ధనవంతుడు) అని పిలిచే వ్యక్తి గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. నష్టపోతున్న ఎల్ఐసీ, ఎస్బీఐల్లో ప్రజాధనంపై జవాబుదారీతనం ఎందుకు లేదని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios