Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ లో విషాదం.. చంబల్ నదిలో మునిగి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు

మధ్యప్రదేశ్ లోని చంబల్ నదిలో మునిగి ఇద్దరు యాత్రికులు మరణించారు. మరో ఐదుగురు తప్పిపోయారు. వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతోంది. ఓ గ్రామంలో 17 మంది  రాజస్థాన్ లోని మొరేనా జిల్లాలో ఉన్న కైలా దేవి ఆలయానికి వెళ్లేందుకు నదిని దాటాలని ప్రయత్నించారు. ఈ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Tragedy in Madhya Pradesh.. 2 dead after drowning in Chambal river.. 5 missing ISR
Author
First Published Mar 19, 2023, 11:37 AM IST

మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. చంబల్ నదిలో మునిగి ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు గల్లంతు అయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని శివపురి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 17 మంది యాత్రికులు రాజస్థాన్ లోని మొరేనా జిల్లాలో ఉన్న కైలా దేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు గత గురువారం గ్రామం నుంచి బయలుదేరారు. ఇందులో పెద్దలతో పాటు మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

మద్యం మత్తులో అర్థరాత్రి యువతుల హల్చల్.. ఎట్టకేలకు అరెస్టు..

వీరంతా కాలి నడకన దేవీ ఆలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరంతా నడుచుకుంటూ చంబల్ నది వద్దకు చేరుకున్నారు. అయితే కైలా దేవి ఆలయానికి చేరుకోవాలంటే వారంతా ఆ నదిని దాటాల్సి ఉంటుంది. దీంతో వీరంతా ఒకరినొకరు పట్టుకొని నదిని దాటడం ప్రారంభించారు. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు నీటి మట్టం పెరిగింది. దీనిని వారు అంచనా వేయలేకపోయారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం..

ఈ క్రమంలో ఐదుగురు యాత్రికులు నీటిలో మునిగిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో రెండు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయం తరువాత నీటిలో నుంచి ఇద్దరు మృతదేహాలను వెలికి తీశారు. చనిపోయిన వారిలో ఒకరిని దేవకినందన్ కుష్వాహ్ (55), అతని మరదలు కల్లో కుష్వాహ్ (40)గా గుర్తించారు.

తమిళనాడులో రాజకీయ కలకలం.. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిలో చీలిక.!

ఐదుగురిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో దేవకినందన్ కుష్వా భార్య అలోపా కుష్వాహ్, రుక్మిణి కుష్వా, లవకుష్ కుష్వా బ్రిజ్మోహన్ కుష్వాహ్, రష్మీ కుష్వా ఉన్నారు. వీరంత సమీప బంధువులే. కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన దేవకినందన్ గతంలో కూడా కైలా దేవీ ఆలయన్ని దర్శించుకున్నారు. 4-5 సార్లు విజయవంతంగా ఈ నదిని దాటారు. ఈ నది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్-చంబల్ ప్రాంతాన్ని రాజస్థాన్ లోని బ్రజ్ ప్రాంతంతో కలుపుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios